E-Paper
Advertisement

HP All-in-One Printers: తక్కువ ధరలో ఆల్-ఇన్-వన్ వైర్‌లెస్ ప్రింటర్స్.. హెచ్‌పీ డెస్క్‌జెట్ ప్రింటర్స్ లాంచ్

HP All-in-One Printers: తక్కువ ధరలో ఆల్-ఇన్-వన్ వైర్‌లెస్ ప్రింటర్స్.. హెచ్‌పీ డెస్క్‌జెట్ ప్రింటర్స్ లాంచ్
Advertisement

HP All-in-One Printers| హెచ్‌పీ కంపెనీ భారత మార్కెట్‌లో కొత్త డెస్క్‌జెట్ ఆల్-ఇన్-వన్ ప్రింటర్ల సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రింటర్లు విద్యార్థులు, కుటుంబాలు, చిన్న ఆఫీసుల్లో రోజువారీ ప్రింటింగ్ అవసరాలకు రూపొందించబడ్డాయి. డెస్క్‌జెట్, .. డెస్క్‌జెట్ ఇంక్ అడ్వాంటేజ్, డెస్క్‌జెట్ అల్ట్రా ఇంక్ అడ్వాంటేజ్ సిరీస్‌లలో మొత్తం 6 మోడల్స్ ఉన్నాయి. ప్రింట్, స్కాన్, కాపీ ఫంక్షన్లు ఇంటి, చిన్న ఆఫీస్ ఉపయోగానికి సరిపోతాయి. సులభమైన సెటప్, వైర్‌లెస్ కనెక్షన్, నమ్మకమైన ప‌ర్‌ఫామెన్స్‌పై హెచ్‌పీ దృష్టి పెట్టింది.

సులభ సెటప్, స్మార్ట్ కనెక్టివిటీ

కొత్త డెస్క్‌జెట్ ప్రింటర్లు ప్లగ్-ఆండ్-ప్లే సెటప్‌తో వస్తాయి. టెక్నికల్ సహాయం లేకుండా త్వరగా సెట్ చేసుకోవచ్చు. డ్యుయల్-బ్యాండ్ వై-ఫై (2.4GHz మరియు 5GHz) సపోర్ట్ ఉంది. సెల్ఫ్-హీలింగ్ వై-ఫై ఫీచర్ వల్ల కనెక్షన్ డ్రాప్ అయినా స్వయంగా తిరిగి కనెక్ట్ అవుతుంది. ఇది రోజువారీ వైర్‌లెస్ ప్రింటింగ్‌ను అడ్డుకోకుండా చేస్తుంది.

హెచ్‌పీ డెస్క్‌జెట్ ప్రింటర్ల ధరలు

Advertisement

HP DeskJet Ink Advantage 2986 – రూ.6,999
HP DeskJet Ink Advantage 2989 – రూ.6,999
HP DeskJet Ink Advantage 4388 – రూ.7,999
ఈ మోడల్స్ HP వరల్డ్ స్టోర్లు, HP అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తాయి. HP DeskJet Ultra Ink Advantage 5135, 5185 మోడల్స్, DeskJet 2931 త్వరలో అందుబాటులోకి వస్తాయి.

డిజైన్, రంగు ఆప్షన్లు

అన్ని మోడల్స్ క్లీన్ వైట్ బేస్ డిజైన్‌తో వస్తాయి. ఆధునిక ఇంటీరియర్‌కు సరిపడేలా Very Peri, Surf Blue, Machu Picchu, Warm Aroma, Pimento వంటి ఆకర్షణీయ రంగుల్లో యాక్సెంట్ ఆప్షన్లు ఉన్నాయి. కాంపాక్ట్ డిజైన్ వల్ల చిన్న గదుల్లో డెస్క్ స్పేస్ ఆదా అవుతుంది.

ప్రధాన ఫీచర్లు

Advertisement

అన్ని మోడల్స్ ప్రింట్, స్కాన్, కాపీ చేయగలవు. HP థర్మల్ ఇంక్‌జెట్ టెక్నాలజీ ఉపయోగిస్తాయి. డ్రైవర్ సహాయంతో మాన్యువల్ డ్యూప్లెక్స్ ప్రింటింగ్ సాధ్యం. 60 షీట్ల ఇన్‌పుట్ ట్రే ఉంది. ఫ్లాట్‌బెడ్ CIS స్కానర్ 1,200dpi ఆప్టికల్ రెజల్యూషన్ ఇస్తుంది. JPEG, PDF, PNG, TIFF ఫార్మాట్లలో స్కాన్ చేయవచ్చు.

కనెక్టివిటీ, ప్రింటింగ్ స్పీడ్

ఈ కొత్త ప్రింటర్స్‌తో కనెక్టివిటీ ఫీచర్స్ చూస్తే.. డ్యుయల్-బ్యాండ్ వై-ఫై, USB 2.0 పోర్ట్ ఉన్నాయి. HP యాప్ ద్వారా మొబైల్ నుంచి ప్రింట్ చేయవచ్చు. Apple AirPrint, Mopria, Android సర్వీసెస్ సపోర్ట్ ఉంది. బ్లాక్ ప్రింట్ స్పీడ్ 7.5 ppm వరకు, కలర్ 5.5 ppm వరకు ఉంటుంది. నెలకు 1,000 పేజీల డ్యూటీ సైకిల్ సపోర్ట్ ఉంది.

డెస్క్‌జెట్ ఇంక్ అడ్వాంటేజ్ మోడల్స్ తేడాలు

2986, 2989 మోడల్స్ తక్కువ ప్రింటింగ్ (నెలకు 50-100 పేజీలు) అవసరమైన ఇంటి యూజర్లకు సరిపోతాయి. 4388 మోడల్ ఎక్కువ వర్క్‌లోడ్ (100-300 పేజీలు) తట్టుకుంటుంది. ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ ఉంది. బ్లాక్ ప్రింట్ స్పీడ్ 8.5 ppm వరకు ఉంటుంది.

Also Read: పిండి వేస్తే చాలు రోటీ రెడీ.. వేయించాల్సిన అవసరం లేదు.. ఫుల్ ఆటోమెటిక్ మెషీన్

డెస్క్‌జెట్ అల్ట్రా ఇంక్ అడ్వాంటేజ్ మోడల్స్

5135, 5185 మోడల్స్ ఇంక్ ఎక్కువ కాలం నడిచేలా రూపొందించబడ్డాయి. నెలకు 50-100 పేజీలు సిఫార్సు చేస్తారు. బ్లాక్ రెజల్యూషన్ 1,200 x 1,200 dpi, కలర్ 4,800 x 1,200 dpi వరకు ఉంటుంది. బాక్స్‌లో సెటప్ ఇంక్ కార్ట్రిడ్జ్‌లు ఇస్తారు.

ఎంట్రీ లెవల్ HP DeskJet 2931

2931 బేసిక్ మోడల్. ఇంట్లో సాధారణ ప్రింటింగ్ అవసరాలకు సరిపోతుంది. నెలకు 50-100 పేజీలు సిఫార్సు. ఇతర మోడల్స్‌లాగే వై-ఫై, స్కానింగ్ ఫీచర్లు ఉన్నాయి. Windows 10, 11 లేటెస్ట్ macOSతో పనిచేస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×