E-Paper
Advertisement

Huawei Mate 80 Series: హువావే మేట్ 80 ఫోన్ ఫస్ట్ లుక్..టెక్ మార్కెట్‌కి షాక్ ఇచ్చిన కొత్త రింగ్ లెన్స్ డిజైన్

Huawei Mate 80 Series: హువావే మేట్ 80 ఫోన్ ఫస్ట్ లుక్..టెక్ మార్కెట్‌కి షాక్ ఇచ్చిన కొత్త రింగ్ లెన్స్ డిజైన్
Advertisement

Huawei Mate 80 Series: మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త ఫోన్‌లు వినియోగదారుల ముందుకు వస్తుంటే హువావే మాత్రం తన ప్రత్యేక మేట్ శైలిని కొనసాగిస్తూ మేట్ 80 ని పరిచయం చేసింది. ఫస్ట్ లుక్ బయటకు రావడంతో ప్రజల్లో ఉన్న భారీ ఆసక్తిని చూపిస్తున్నాయి. హువావే హార్డ్‌వేర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ని బలపరచడం వల్ల మేట్ 80 ఫోటోగ్రఫీని మరో స్థాయికి తీసుకెళ్తుందని టెక్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. దీని ధర, లాంచింగ్ డేట్ ఒక్కసారి లుక్ వేయండి.

రింగ్ మాడ్యూల్ డిజైన్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే హువావే తన మేట్ సిరీస్‌ని ఎప్పుడూ ప్రీమియమ్ డిజైన్‌తో తీర్చిదిద్దుతుంటుంది. మేట్ 80లో వెనుక భాగంలోని రింగ్ మాడ్యూల్, దాని చుట్టూ ఇచ్చిన మెటల్ ఆకృతి, ఫోన్ పట్టుకున్నప్పుడు వచ్చే గ్రిప్ అన్నీ అప్‌డేటెడ్ లుక్ లో భాగమే. ఫోన్ చేతిలోకి తీసుకుంటే ఇచ్చే సాలిడ్ ఫీల్ హువావే ప్రత్యేకత. ముందుభాగంలో స్క్రీన్ బెజెల్స్ తగినంత సన్నగా ఉండడం, పక్కల్లో వచ్చే కర్వ్ ఫినిషింగ్, మొత్తం షేప్ ని చూస్తే మేట్ 80 ని హై-ఎండ్ లోకి తీసుకెళ్తాయి.

ఫ్లూయిడిటీ డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే హువావే ఈసారి తక్కువ శక్తి వినియోగం, పెరిగిన లుమినెన్స్ తో, రంగుల్ని నిజానికి దగ్గరగా చూపించే డిస్‌ప్లే టెక్నాలజీ. స్క్రోల్ చేసినప్పుడు వచ్చే ఫ్లూయిడిటీ, డిస్ ప్లే పై టచ్ రెస్పాన్స్, హెచ్‌డిఆర్‌లో వచ్చే రంగుల హైలైట్ ఇవన్నీ మేట్ 80 అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి. పెద్ద స్క్రీన్ అయినా కూడా రిఫ్లెక్షన్ తగ్గించే ప్రత్యేక కష్టింగ్ఉపయోగించినట్టు తెలుస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వాడుకలో మేట్ 80 డిస్‌ప్లే పెద్ద ప్లస్ పాయింట్‌గా ఉండనుంది.

పనితీరులో పర్‌ఫెక్ట్

పనితీరు విషయానికి వస్తే, మేట్ 80లో ఉన్న కొత్త చిప్ ఫోన్ పని తీరు లో ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. రోజంతా వాడిన, హీట్ పెరగకుండా కూల్‌గానే ఉంచుతుంది. యాప్స్ స్పీడ్‌గానే ఓపెన్ కావడం, ఫోన్‌లో జరిగే సింపుల్ వర్క్ అన్నీ లాగ్ లేకుండా నడవాలనే ఉద్దేశంతో ఈ మోడల్‌ని తయారు చేసినట్టు తెలుస్తోంది. భారీ గేమింగ్, ఎక్కువ ఫైల్స్ ఓపెన్ చేసిన తట్టుకునే సామర్థ్యం వంటి అంశాల్లో మేట్ 80 మరింత సులువుగా పనిచేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ మోడల్‌కు అనుగుణంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అడ్జస్ట్‌మెంట్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

Also Read: Realme 5G Smartphone: రియల్‌మీ బిగ్ అప్‌డేట్.. 16జిబి ర్యామ్‌, భారీ బ్యాటరీతో కొత్త 5జీ మోడల్ లాంచ్

కెమెరా.. రాత్రి ఫోటోగ్రఫీ హువావే ప్రత్యేకత

కెమెరా విషయానికి వస్తే మేట్ 80లో హువావే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. కొత్త ఎక్స్‌మేజ్ ప్రో మోడ్, నాచురల్‌గా కనిపించే రంగులు, దూరం నుంచి తీసే చిత్రాల్లో వచ్చే స్పష్టత ఇవన్నీ ఈసారి ప్రధాన ఆకర్షణగా మారాయి. రాత్రి ఫోటోగ్రఫీ హువావే ప్రత్యేకత. మేట్ 80లో రాత్రి దృశ్యాల్లో డార్క్ ఏరియాస్, బ్రైట్ ఏరియాస్ రెండూ క్లియర్‌గా కనిపించేలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కదులుతున్న దృశ్యాలను పట్టుకునే సామర్థ్యం కూడా పెరగడంతో వీడియోలు తీసేటప్పుడు ప్రతి ఫ్రేమ్ స్థిరంగా రికార్డ్ అవుతుందని చెప్పబడుతోంది.

భారీ బ్యాటరీతో ఎంట్రీ

బ్యాటరీ విషయానికి వస్తే మేట్ 80లో ఈసారి పెద్ద సామర్థ్యం ఉన్న బ్యాటరీని హువావే ఉపయోగించినట్టు సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం ఉపయోగించిన సరిపోయే స్థాయిలో ఉండేలా ఈ మోడల్‌ను రూపొందించారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ వేగం కూడా పెరిగే అవకాశం ఉండడంతో తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ చేసేలా హువావే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ముందు తయారు చేసిన మోడళ్లలో ఇచ్చిన బ్యాటరీ పనితీరు మంచి స్పందన తెచ్చిన కారణంగా మేట్ 80లో కూడా ఇదే ప్రధానం లక్ష్యంగా చేసిందని టెక్ వర్గాల టాక్.

ధర ఎంతంటే?

ఇండియాలో మేట్ 80 ధరపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదే కానీ టెక్ వర్గాలు అంచనా వేస్తున్న మొత్తం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బయటకు లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర సుమారు రూ.70,000 నుంచి రూ.80,000 మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచింగ్ తేదీ నవంబర్ 25గా ఖరారు కాగా ఈరోజు మధ్యాహ్నం 12:08 గంటలకు మేట్ 80 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆన్‌లైన్ స్టోర్లలో రిజర్వేషన్ అందుబాటులోకి రావడంతో మొదటి గంటలోనే మేట్ అభిమానులు పెద్ద సంఖ్యలో బుకింగ్స్ జరుగుతున్నాయి. డిజైన్, కెమెరా, పనితీరు, అన్నీ కలిసి మేట్ సిరీస్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ని తీసుకొచ్చేలా ఉన్నాయి.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×