E-Paper
Advertisement

Acne with Fruits: ఈ పండ్లు అధికంగా తింటే ముఖంపై మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త

Acne with Fruits: ఈ పండ్లు అధికంగా తింటే ముఖంపై మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త
Advertisement

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ కొన్ని పండ్లను అధికంగా తింటే శరీరంలో వేడి పెరిగిపోతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖంపై మొటిమలు రావడానికి కూడ కొన్ని పండ్లు కారణమవుతాయి. ఎలాంటి పండ్లు తినడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుందో తెలుసుకోండి.

పీచ్
పీచ్ పండ్లు తీపిగా, రుచిగా ఉంటుంది. కానీ ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఆ వేడి కారణంగా ముఖంపై చిన్న చిన్న మొటిమలు వస్తాయి. కొంతమందికి పీచ్ పండు వల్ల అలెర్జీ కూడా రావచ్చు. అవి కూడా మొటిమల్లాగా కనిపిస్తాయి.

Advertisement

జామకాయ
జామకాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది. కానీ ఈ పండ్లను ఎక్కువగా తింటే పొట్ట బరువుగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. ఈ పండు సరిగా జీర్ణం కాకపోతే చర్మం కూడా ప్రభావితమవుతుంది. దీనివల్ల మొటిమలు రావచ్చు.

మామిడి
మామిడి పండు చాలా తీపిగా, రుచిగా ఉంటుంది. కానీ దీనిని ఎక్కువగా తింటే శరీరంలో హీట్ పెరుగుతుంది. ఈ వేడి వల్ల ముఖంపై ర్యాష్‌లు, మొటిమలు రావచ్చు. అందుకే రోజూ మామిడి తినే పరిమాణాన్ని తగ్గిస్తే మంచిది.

Advertisement

పనస పండు
పనసపండు కూడా శరీరంలో వేడి పెంచే ఫలాల్లో ఒకటి. దీనిని ఎక్కువగా తింటే ముఖం ఎర్రగా కావడం, చర్మం విరిగిపోవడం, మొటిమలు రావడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం సున్నితంగా ఉండేవారు పనసపండును జాగ్రత్తగా తినాలి.

స్టార్ ఆపిల్
స్టార్ ఆపిల్‌లో ఉండే కొన్ని పదార్థాలు జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. ఇది శరీరంలో వేడిని పెంచి మొటిమలు రావడానికి కారణమవుతాయి. ఈ ఫలాన్ని తినే ముందు తొక్క తొలగిస్తే సమస్య కొంచెం తగ్గుతుంది.

ఏ పండు తిన్నా కూడా అతిగా తినకూడదు. పరిమితంగా తినడం చాలా ముఖ్యం. ఒకే పండును అధికంగా తినే కన్నా వేర్వేరు పండ్లను ఎంపిక చేసుకుని తినడం మంచిది. జీర్ణ సమస్యలు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినకపోవడం మంచిది. పండ్లు తినే ముందు బాగా కడిగి శుభ్రం చేసుకుని ఆ తరువాతే తినాలి.

Related News

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

Big Stories

Advertisement
×