E-Paper
Advertisement

గ్యాస్ సిలిండర్ ధరకు దెబ్బ.. ఇండక్షన్ వాడితే బిల్లు తడిసి మోపెడవుతుందా?

గ్యాస్ సిలిండర్ ధరకు దెబ్బ.. ఇండక్షన్ వాడితే బిల్లు తడిసి మోపెడవుతుందా?
Advertisement

Induction Tips: అక్కడ యుద్దం జరగడం ఏంటో కానీ దాని వల్ల మనం సిలిండర్ల కోసం మనం యుద్దాలు చేయాల్సిన పరిస్థితి. అందుకే చాలా మంది ఈ యుద్దాలు చేయడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ  ఇండక్షన్ కుక్‌టాప్‌ (Induction Cooktop)ల వైపు చూస్తున్నారు.అయితే అవసరం పడిందిగా అని చాలా మంది వాడనైతే వాడుతున్నారు కానీ ఇపుడు “ఇండక్షన్ వాడితే కరెంట్ బిల్లు కొంప ముంచుతుందేమో?” అన్న భయం చాలా మందిలో మొదలైపోయింది. మరి ఇండక్షన్ కుక్‌టాప్‌ వాడుతూ కరెంట్ బిల్ ని ఈ చిన్నిట్రిక్స్ వాడి ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో తెలుసుకుందామా !

అన్ని గిన్నెలు ఇండక్షన్‌ మీద పని చేయవు 

Advertisement

మొదటగా ఇండక్షన్ స్టవ్ తేగానే చాలా మంది చేసే పని ఇంట్లో ఉన్న గిన్నెలు అన్ని పెడుతుంటారు. మీ ఇంట్లో ఉన్న అన్ని గిన్నెలు ఇండక్షన్‌ మీద పని చేయవని తెలుసుకోండి. గిన్నె అడుగు భాగం ఫ్లాట్‌గా ఉండి, అయస్కాంతం అంటుకునేలా ఉండాలి.అలా కాకుండా నాసిరకం పాత్రలు వాడితే వేడి సరిగ్గా వెళ్ళకుండా  కరెంట్ వేస్ట్ అవుతుంది.సొ పక్కాగా ఫ్రెండ్లీగా ఉండే పాత్రలనే వాడండి.

also read:బాక్సాఫీస్ దగ్గర ‘బైకర్’ పంక్చర్.. ‘రాకాస’ అరాచకం! శర్వా, సంగీత్ కష్టాలు మామూలుగా లేవుగా!

Advertisement

ఇలా చేస్తే మీ కరెంట్ మీటర్ ఫ్యాన్ లా పరిగెత్తుతుంది 

ఇక చాలా మంది వంట చక చక అయిపోవాలని హైమోడ్‌లో  పెట్టేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.ఇలా చేస్తే మీ కరెంట్ మీటర్ ఫ్యాన్ లా పరిగెత్తుతుంది. సొ ఒక్కసారి గిన్నె వేడెక్కాక, పవర్ సెట్టింగ్‌ను మీడియం లేదా లోకి మార్చండి. దీనివల్ల వంట మాడిపోదు సరికదా బిల్లు కూడా ఆదా అవుతుంది.

వండే ముందు కనీసం 30 నిమిషాలు

ఇక ఏవైనా పప్పు, బియ్యం, శనగలు వంటివి వండే ముందు కనీసం 30 నిమిషాలు నానబెట్టడం ఉత్తమం . దీని వల్ల అవి త్వరగా ఉడుకడమే కాదు. వంట సమయం తగ్గి కరెంట్ బిల్లు కంట్రోల్లో ఉంటుంది. ఇక వంట వండేటప్పుడు గిన్నె మీద ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టడం మరచిపోవద్దు. మూత పెడితే లోపల స్టీమ్ పెరిగిపోయి పదార్థం త్వరగా  ఉడికిపోతుంది. అంటే ఆ చిన్న మూతే  మంత్  ఎండ్  బిల్లులో పెద్ద తేడా చూపిస్తుందన్న మాట

వంట 90% పూర్తవ్వగానే స్విచ్ ఆఫ్

ఇండక్షన్ స్టవ్‌లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉందన్న సంగతి మీకు తెలుసా .. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ గ్లాస్ టాప్, పాత్ర కొన్ని నిమిషాల పాటు విపరీతమైన వేడిని కలిగి ఉంటాయి.సొ .. మీరు చేసే వంట 90% పూర్తవ్వగానే స్విచ్ ఆఫ్ చేయండి. ఆ మిగిలిన వేడితోనే వంట ఫినిష్ అవుతుంది. ఇలా గనుక చేస్తే  రోజుకు కనీసం 15 నిమిషాల కరెంట్‌ను సేవ్ చేయొచ్చు.

పదార్థాలు పేరుకుపోయాయేమో చూసుకోండి

ఇక మీ స్టవ్ మీద జిడ్డు,మాడిన పదార్థాలు పేరుకుపోయాయేమో చూసుకోండి. అలా ఉంటే మాత్రం  హీట్ ట్రాన్స్‌ఫర్ సరిగ్గా జరగదు. ఫలితంగా స్టవ్ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది.అందువల్ల  ప్రతిరోజూ వంట అయ్యాక ఒక మెత్తని బట్టతో తుడిస్తే శుభ్రతతో పాటు  ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. మరి ఈ చిన్ని చిన్ని చిట్కాలు వాడి మీ ఇండక్షన్ స్టవ్ ని సరిగ్గా వాడుకుంటారు కదూ !

also read:ఏసీ గదిలో హాయిగా నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×