E-Paper
Advertisement

Infinix Note 40 Racing Edition: 108MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త సిరీస్.. సేల్ ఎప్పుడంటే..?

Infinix Note 40 Racing Edition: 108MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త సిరీస్.. సేల్ ఎప్పుడంటే..?
Advertisement

Infinix Note 40 Pro, Infinix Note 40 Pro+: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో కూడా అధిక జనాభా స్మార్ట్‌ఫోన్లను యూజ్ చేస్తున్నారు. అందువల్లనే దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌లో దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక న్యూ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేయబడింది.

ప్రముఖ టెక్ బ్రాండ్ Infinix భారతదేశంలో Infinix నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్‌ F1 మోడల్ వంటి డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ కోసం కంపెనీ BMW డిజైన్‌వర్క్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ మోడల్ మాదిరిగానే అదే స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గరిష్టంగా ఇది 12 GB RAMతో వస్తుంది. ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.

Advertisement

ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, 20 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇక ఈ సిరీస్‌లో రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. అందులో Infinix Note 40 Pro, Infinix Note 40 Pro+ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటి వేరియంట్లు, ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం. కంపెనీ Infinix Note 40 Pro రేసింగ్ ఎడిషన్‌ను ఒకే వేరియంట్‌లో లాంచ్ చేసింది. 8 GB RAM + 256 GB స్టోరేజ్‌. దీనిని రూ.15,999 ధరతో కంపెనీ రిలీజ్ చేసింది.

Also Read: ఐ ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక.. ఈ 4 పదాలు టైప్ చేస్తే ఫోన్ క్రాష్

Advertisement

అదే సమయంలో కంపెనీ Infinix Note 40 Pro+ రేసింగ్ ఎడిషన్‌ను 12GB RAM + 256 GB స్టోరేజ్‌తో తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌ ధరను కంపెనీ రూ. 18,999గా నిర్ణయించింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందే అవకాశం ఉంది. ఆగస్టు 26 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌లు సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

ఇక వీటి స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్, నోట్ 40 ప్రో+ రేసింగ్ ఎడిషన్ ఒరిజినల్ మోడల్‌ల మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. 6.78-అంగుళాల కర్వ్డ్ LTPS AMOLED డిస్‌ప్లేతో వచ్చాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 12 GB RAMతో జత చేయబడిన ఆక్టా కోర్ MediaTek Dimensity 7020 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. నోట్ 40 ప్రో+ రేసింగ్ ఎడిషన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ మరో రెండు సెన్సార్లతో పాటు OIS మద్దతుతో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ కోసం ఇది 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంది. వీటికి IP53 రేటింగ్ ఉంది. రెండు మోడల్‌లు పవర్ మేనేజ్‌మెంట్ కోసం పని చేసే అంతర్గత చీతా X1 చిప్‌ను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లలో 20W వైర్‌లెస్ ఛార్జింగ్ అందించబడింది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×