Alert for I Phone Users : టెక్ మార్కెట్ లో ఉదయం నుంచి ఒకటే అలర్ట్ నోటీసులు వస్తుంటే, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఐఫోన్ వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. వీళ్లుగానీ నాలుగు పదాలు టైప్ చేస్తే చాలు. ఐఫోన్, ఐప్యాడ్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. ఏ పదాలు టైప్ చేస్తే అవి క్రాష్ అవుతున్నాయని అంటున్నారంటే..
అవి నాలుగు సింపుల్ అక్షరాలని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు చెబుతున్నారు. దీంతో కొత్తగా వేలు, లక్షలు పోసి ఐఫోన్లు కొన్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ బగ్ కారణంగా నిమిషాల వ్యవధిలోనే అంతా అయిపోతోందని చెబుతున్నారు. కాసేపటికి ఐఫోన్ హోమ్ స్క్రీన్ కూడా క్రాష్ అవుతుందని చెబుతున్నారు.
ఐఫోన్ యూజర్ యాప్ లైబ్రరీలో లేదా స్పాట్‌లైట్ శోధనలో ఈ 4 అక్షరాలను “::” టైప్ చేయడం వల్ల ఫోన్ క్రాష్ అవుతోందని మాస్టోడాన్‌లోని సెక్యూరిటీ రీసెర్చర్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
ఇకపోతే, ఈ అక్షరాలను పొరపాటునకానీ, సరదాగా కానీ, ఫర్వాలేదులే.. ఏమవుతుంది? ఒకసారి చూద్దామనిగానీ టైప్ చేశారంటే చాలు.. ఎక్కడో ఫోన్ లో దాక్కున్న బగ్ సడన్ గా యాక్టివేట్ అవుతుందని తెలిపారు. అందుకే పొరపాటున కూడా ఈ 4 అక్షరాలను టైప్ చేయవద్దని మరీ మరీ చెబుతున్నారు.
Also Read: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు.. తగ్గుతున్నాయా?
అత్యుత్సాహం ఉన్నవాళ్లు ఒకవేళ ఈ బగ్ ని తనిఖీ చేయాలని భావిస్తే మాత్రం.. ఆ రిస్క్ తీసుకోవడానికి ముందు మీ ఐఫోన్లలో బ్యాకప్ వేరే దాంట్లోకి మార్చుకుని, లేదా చెక్ చేసుకుని, ఇంపార్టెంట్ ఉంటే, వేరే చోట నోట్ చేసుకుని అప్పుడు “::” ఇలా 4 అక్షరాలను టైప్ చేసి చూడమని టెక్ నిపుణులు సలహాలిస్తున్నారు.
అయితే, యాపిల్ ఫోన్ లో నిద్రపోతున్న‘బగ్ ’ని నిద్ర లేపాలని చూసేందుకు.. ఇంకా పలు మార్గాలున్నాయని చెబుతున్నారు. ఐఫోన్ లో హోమ్ స్క్రీన్ పేజీలను దాటి యాప్ లైబ్రరీలోని నాలుగు అక్షరాల కోసం స్వైప్ చేస్తే, మీ ఆపిల్ ఐ ఫోన్ లాక్ స్క్రీన్ కు తిరిగి లోడ్ అవుతుంది. సెట్టింగ్స్ పేజీలోని సెర్చ్ బార్ లోని అక్షరాలను టైప్ చేయడం ద్వారా కూడా బగ్ ను ప్రేరేపించవచ్చునని చెబుతున్నారు.
అంటే, ఇది సరదాగా చెబుతున్నా.. అందులో అర్థం ఏమిటంటే.. ఈ ప్రయత్నాలు సరదాకి కూడా చేయవద్దని సూచిస్తున్నారు. ఓఎస్ 17, బీటా ఐఓఎస్ 18 లేటెస్ట్ వెర్షన్లలో ఈ బగ్ ను ఇట్టే ప్రేరేపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ కొత్త అప్ డేట్ 17.6.2 లో..ఈ సమస్యను పరిష్కరించి బగ్ ను సరిదిద్దే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతానికైతే ఐఫోన్ కంపెనీ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరి భవిష్యత్తులోనైనా ఈ సమస్య నుంచి బయటపడతారా? లేదా? అనేది చూడాలి.