E-Paper
Advertisement

ఎడిటింగ్ లేదు, ఫిల్టర్లు లేవు ఇన్‌స్టాంట్స్‌తో రియల్ టైమ్ ఫోటో షేరింగ్

ఎడిటింగ్ లేదు, ఫిల్టర్లు లేవు  ఇన్‌స్టాంట్స్‌తో రియల్ టైమ్ ఫోటో షేరింగ్
Advertisement

Instagram Instants App launch: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్, యూజర్ల కోసం సరికొత్త అనుభవాన్ని అందిస్తూ ‘ఇన్‌స్టాంట్స్‌’ (Instants) అనే కొత్త యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్నాప్‌చాట్, బీరియల్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీనిచ్చేలా రూపొందించిన ఈ యాప్, కేవలం రియల్ టైమ్ ఫోటో షేరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం స్పెయిన్, ఇటలీలలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ యాప్, ఫోటో ఎడిటింగ్ లాంటి హంగులు లేకుండా ప్యూర్ అండ్ అన్‌ఫిల్టర్డ్ ఫోటోలను షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టాంట్స్‌’:
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎడిటింగ్, ఫిల్టర్ల వాడకం ఎక్కువగా ఉంటోంది. అయితే.. యూజర్లు మళ్ళీ సహజమైన ఫోటోల వైపు మొగ్గు చూపుతుండటంతో మెటా సంస్థ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ముఖ్యమైన ఫీచర్లు:

Advertisement

వన్-ట్యాప్ కెమెరా: యాప్‌ను ఓపెన్ చేయగానే నేరుగా కెమెరా కనిపిస్తుంది. ఒక్క ట్యాప్‌తోనే ఫోటో తీసి.. వెంటనే ప్రెండ్స్ కు పంపొచ్చు. ఇందులో గ్యాలరీ నుంచి పాత ఫోటోలను అప్‌లోడ్ చేసే అవకాశం లేదు.

ఎడిటింగ్ లేదు: ఈ యాప్‌లో ఫిల్టర్లు లేదా ఎడిటింగ్ టూల్స్ ఉండవు. కేవలం టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫోటోలోని నేచురాలిటీని కాపాడుతుంది.

Advertisement

ఆటో డిలీట్ & వ్యూ వన్స్: అవతలి వ్యక్తి ఫోటో చూసిన తర్వాత అది వెంటనే కనిపించకుండా పోతుంది. అలాగే.. 24 గంటల తర్వాత ఇవి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ఇది వాట్సాప్‌లోని ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను పోలి ఉంటుంది.

సింక్ ఆప్షన్: ఇన్‌స్టాలో మీకు ఉన్న ‘క్లోజ్ ఫ్రెండ్స్’ లేదా మ్యూచువల్ ఫాలోవర్స్ లిస్ట్ ఈ యాప్‌లోకి ఆటోమేటిక్‌గా సింక్ అవుతుంది. దీని వల్ల ప్రతిసారీ కొత్తగా ఫ్రెండ్స్‌ను వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

ఎందుకు ఈ కొత్త యాప్?
ఇన్‌స్టా మెయిన్ యాప్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాడ్స్ , రీల్స్‌తో నిండిపోయింది. పాత రోజుల్లో లాగా ఫ్రెండ్స్ మధ్య కేవలం ఫోటోలు పంచుకునే సౌలభ్యం తగ్గుతూ వచ్చింది. దీన్ని తిరిగి తీసుకురావడానికి.. అలాగే స్నాప్‌చాట్‌కు మళ్ళీ దగ్గరవుతున్న యువతను ఆకర్షించడానికి మెటా ‘ఇన్‌స్టాంట్స్‌’ను రంగంలోకి దించింది.

Also Read: అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్‌లు.. వీటి కంటే బెస్ట్ ఉండవేమో !

పోటీ:
ఇప్పటికే ‘బీరియల్’,’లాకెట్’ వంటి యాప్‌లు ఈ తరహా ఫీచర్లతో మార్కెట్లో ఉన్నాయి. ఇన్‌స్టా తన భారీ యూజర్ బేస్ సహాయంతో వీటిని అధిగమించాలని చూస్తోంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్, యూజర్ల స్పందనను బట్టి త్వరలోనే ఇండియా సహా ఇతర దేశాల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ యూజర్ల అభిరుచులు మారుతున్నాయి. మేకప్ లేకుండా, ఫిల్టర్లు వాడకుండా అసలు సిసలైన క్షణాలను పంచుకోవాలనుకునే వారికి ‘ఇన్‌స్టాంట్స్‌’ ఒక అద్భుతమైన వేదిక కానుంది. మెటా చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.

Also Read: ఫిట్‌నెస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్.. గూగుల్ పిక్సెల్ వాచ్ ఆఫర్ ధరలోనే !

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×