E-Paper
Advertisement

ఒక్క వీడియోతో మెక్సికోను షేక్ చేస్తున్న రాజమౌళి!

ఒక్క వీడియోతో మెక్సికోను షేక్ చేస్తున్న రాజమౌళి!
Advertisement

Varanasi Movie: దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. కుంభ అనే ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. పైగా వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళి ఈ సినిమా నుండి మొదటి గ్లింప్స్ ను మెక్సికోలో విడుదల చేసి సినిమాపై ఊహించని అంచనాలు పెంచేశారు . అంతేకాదు మహేష్ బాబు పై అలాగే సినిమాపై ఆయన చేసిన కామెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మెక్సికో వేదికగా వారణాసి మొదటి గ్లింప్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. మెక్సికో సిటీ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక CCXP MX 2026 పాప్ కల్చర్ ఫెస్టివల్ లో భాగంగా రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ ను విడుదల చేయగా.. అక్కడి హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా విజువల్స్ కి స్టన్ అయిపోయారు. ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో సందేశం కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది అనడంలో సందేహం లేదు.

అద్భుతమైన సందేశం పంపిన రాజమౌళి..

Advertisement

ముఖ్యంగా భారతీయ పురాణాలకు.. ప్రపంచ స్థాయి యాక్షన్ ను జోడించి ఈ చిత్రాన్ని ఒక గొప్ప అడ్వెంచర్ గా మలుస్తామని రాజమౌళి హామీ చేశారు. పైగా మునుపెన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త మహేష్ బాబును ఈ సినిమాలో చూస్తారని భరోసా ఇచ్చారు. ఇక మెక్సికో వేదికగా విడుదల చేసిన మొదటి గ్లింప్స్ లో మహేష్ బాబు లుక్ .. పొడవాటి జుట్టు , గడ్డంతో కనిపించి అందరిని మెస్మరైజ్ చేశారు . ఇక మైనస్ డిగ్రీల చలిలో చిత్రీకరించిన అత్యున్నత స్థాయి విజువల్స్.. ఎంఎం కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ ఈ చిన్న గ్లింప్స్ హాలీవుడ్ స్తాయికి తీసుకెళ్లాయని.. అక్కడ సినీ విశ్లేషకులు కూడా ఇప్పుడు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని ఖచ్చితంగా ఆస్కార్ దిశగా అడుగులు వేస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:NBK 111: నుండీ నయనతార అందుకే తప్పుకుందా.. ఈ వ్యత్యాసం ఎందుకు? బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!

కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం..

Advertisement

ఇకపోతే రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలను రంగంలోకి దింపారు . మెక్సికోలో వచ్చిన ఈ అద్భుతమైన స్పందన సినిమా గ్లోబల్ మార్కెట్ విజయానికి నాందిగా కనిపిస్తోంది అని చెప్పవచ్చు . అత్యున్నత ప్రామాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది . మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటి రోజే కలెక్షన్ల హవా కొనసాగిస్తుందని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×