E-Paper
Advertisement

iPhone 16 Pro Max: కొత్త కలర్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఫీచర్లు అదిరిపోయాయ్.. చూశారా?

iPhone 16 Pro Max: కొత్త కలర్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఫీచర్లు అదిరిపోయాయ్.. చూశారా?
Advertisement

iPhone 16 Pro Max: ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ఈ ఫోన్‌ కొనుక్కోవాలని ఎన్నో కోరికలు పెట్టుకుంటుంటారు. లైఫ్‌లో ఒక్కసారి అయినా ఐఫోన్ కొనాలని ఎంతగానో పరితపిస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది ఐఫోన్‌కి. ఇక అమెరికన్ మొబైల్ తయారీ సంస్థ Apple కూడా ఫోన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫోన్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికి కంపెనీ తన లైనప్‌లో 15 సిరీస్‌లను విడుదల చేసింది. ఈ 15 సిరీస్‌లకు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో యాపిల్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అదే iPhone 16 సిరీస్. ఈ సిరీస్‌ను ఈ ఏడాదిలో అంటే సెప్టెంబర్ 9న ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ సిరీస్‌లోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iPhone 16 Pro Max అతిపెద్ద డిస్‌ప్లే, బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పబడింది. అంతేకాకుండా iPhone 16 Pro Max కొత్త డెజర్ట్ టైటానియం రంగులో వస్తుందని తాజాగా ఓ లీక్ ద్వారా వెల్లడైంది. తాజాగా TechBoiler ఐఫోన్ 16 ప్రో మాక్స్‌కి సంబంధించి డమ్మీ యూనిట్‌ను చూపించే వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

ఆ వీడియో ప్రకారం ఇది డెసర్ట్ టైటానియం కలర్‌ను కలిగి ఉంటుంది. ఇది iPhone 15 సిరీస్‌లోని ప్రో మోడల్‌ల మాదిరిగానే సైడ్ గ్రిల్స్‌పై క్రోమ్ ఫినిష్‌డ్‌తో కూడిన మాట్టే టెక్స్‌ట్యూర్డ్ గల బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ డమ్మీ యూనిట్ కూడా దాని డిజైన్‌ను సూచించింది. అంతేకాకుండా ఇందులో పవర్, వాల్యూమ్, యాక్షన్ బటన్‌లతో పాటు కొత్త క్యాప్చర్ బటన్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max వంటి మోడల్స్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: అద్భుతం.. మహాద్భుతం.. ఐఫోన్ లాంటి ఫోన్.. కేవలం రూ.7299లకే లాంచ్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్..!

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌లను తొమ్మిది కోట్ల యూనిట్లకు పైగా తయారు చేయాలని యాపిల్ యోచిస్తోంది. ది ఎలెక్ నివేదిక ప్రకారం.. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో, ఐఫోన్ 16 సుమారు 2.45 కోట్ల యూనిట్లు, ఐఫోన్ 16 ప్లస్ 58 లక్షల యూనిట్లు, ఐఫోన్ 16 ప్రో 2.66 కోట్ల యూనిట్లు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 33.2 కోట్ల యూనిట్లు ఉండవచ్చని తెలుస్తుంది. ఇది గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ కంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి.

ఇక ఈ ఐఫోన్ 16 సిరీస్ ప్రో మోడల్స్‌లో పెద్ద డిస్‌ప్లే ఇవ్వవచ్చని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేక క్యాప్చర్ బటన్ కూడా ఉండవచ్చు. దీనితో వినియోగదారులు కెమెరాను ఆన్ చేయడం లేదా వీడియో తీయడం వంటివి తీసుకోగలుగుతారు. ఇది రైట్ సైడ్ కిందన ఒక మూలలో ఉండవచ్చని అంటున్నారు.

అలాగే DSLR వంటి బటన్‌తో స్టాక్ యాప్‌లో జూమ్ ఇన్ అండ్ అవుట్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల డమ్మీ యూనిట్‌ల వీడియోలో iPhone 16, iPhone 16 Plus రెండూ డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నాయి. ఇది f/1.6 ఎపర్చరు, 2x జూమ్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది కాకుండా అల్ట్రా-వైడ్ కెమెరా f/2.2 ఎపర్చరుతో అందించబడింది. అలాగే నిలువుగా ఇన్‌స్టాల్ చేయబడిన కెమెరా యూనిట్ కనిపిస్తుంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఇవ్వబడుతుంది. ఇది వైడ్ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×