BigTV English

Modi & US: అమెరికాలో ప్రధాని మోదీ కార్యక్రమానికి భారీ స్పందన.. నెల రోజుల ముందే పరిమితికి మించి రిజిస్ట్రేషన్లు

Modi & US: అమెరికాలో ప్రధాని మోదీ కార్యక్రమానికి భారీ స్పందన.. నెల రోజుల ముందే పరిమితికి మించి రిజిస్ట్రేషన్లు

Modi & US| భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని న్యూ యార్క్ నగరంలో ప్రసంగం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 22న జరగనున్న ఈ కార్యక్రమానికి దాదాపు నెల రోజుల ముందే పరిమితికి మించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. నవంబర్ నెల మొదటి వారంలో అమెరికాలో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా అమెరికాలో నివసించే భారతీయులు.. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఎ (IACU) ప్రధాని మోదీ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు (టికెట్లు) విక్రయించగా.. హాల్ ఫుల్ కెపాసిటీ 15 వేల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు సేల్ అయ్యాయి.


‘మోదీ అండ్ యుఎస్ ప్రొగ్రెస్ టుగెదర్’ (Modi & US’ Progress Together) పేరుతో జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న నాసాయు వెటరన్స్ మెమోరియల్ కొలిసియం లో నిర్వహించనున్నారు. ఈ హాలు ఫుల్ కెపాసిటీ 15 వేల మంది ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి 24 వేల మంది ఇండియన్ అమెరికన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికాలో 42 రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

అమెరికాలోని భారతీయుల సంఘం ప్రధాని మోదీ కార్యక్రమంపై స్పందిస్తూ… భారత ప్రధాన మంత్రి అమెరికా పర్యటనను ఇక్కడి భారతీయులందరూ పండుగలా జరుపుకుంటారని తెలిపారు. మోదీ ప్రసంగ కార్యక్రమానికి నాసాయు వెటరన్స్ మెమోరియల్ కొలిసియం లో ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది. సెప్టెంబర్ 2014లో అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ప్రధాన మంత్రి మోదీ అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఇప్పుడు పదేళ్ల తరువాత మళ్లీ ప్రధాని మోదీ అలాంటి కార్యక్రమం చేయడంతో దీనికి ప్రాముఖ్యతం సంతరించుకుంది.


ప్రధాని మోదీ కార్యక్రమానికి వివిధ మతాల ప్రజలు
అమెరికాలో జరుగబోయే ప్రధాని మోదీ కార్యక్రమానికి దాదాపు 590 కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు రిజిస్టర్ చేసుకున్నాయని అమెరికా భారతీయుల సంఘం తెలిపింది. ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లలో వివిధ మతాలకు చెందినవారున్నారని వెల్లడించింది. క్రిస్టియన్, జైన్, సిఖ్, జొరోస్ట్రియన్, యూదులు, ముస్లింలు, హిందూ కమ్యూనిటీలన్నీ మోదీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. వీరిలో బిజినెస్, సైన్స్, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్స్ లాంటి వివిధ రంగాలకు చెందిన వారున్నారని సమాచారం.

అయితే ఈ కార్యక్రమానికి పరిమితికి మించి స్పందన రావడంతో హాలులో అందరికీ వసుతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా భారతీయుల సంఘం తెలిపింది. అదనపు సీట్లు ఏర్పాట్లు చేస్తున్నామని, లాటరీ పద్ధతిలో ముందు వరుసలో ఉన్న 500 సీట్లు జారీ చేస్తున్నామని వెల్లడించింది.

మరోవైపు సెప్టెంబర్ 24-30 వరకు జరగబోయే 79వ ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన మంత్రి మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో సెప్టెంబర్ 26న మోదీ ప్రసంగం చేయనున్నారు. భారత ప్రధాన మంత్రి 2023 జూన్ 21న యోగా కమెమొరేషన్ డే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యలాయానికి పర్యటించారు. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

Also REad: కెనెడాలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు.. భయం గుప్పిట్లో భారత్ విద్యార్థులు!

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×