E-Paper
Advertisement

ఐఫోన్ ఊరికే హీట్ ఎక్కుతోందా? వీటి వల్లే కావొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

ఐఫోన్ ఊరికే హీట్ ఎక్కుతోందా? వీటి వల్లే కావొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!
Advertisement

iPhone Heating Issue: ఐఫోన్ యూజర్లను తరుచూ వెంటాడే సమస్యల్లో హీటింగ్ ఒకటి. అయితే ఫోన్ వేడెక్కడానికి అనేక కారాణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సాఫ్ట్ వేర్ సమస్యల నుంచి వాతావరణం వరకూ ప్రతీది ఐఫోన్ టెంపరేచర్ ను ప్రభావితం చేస్తుంటాయని పేర్కొంటున్నారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతినడమే కాకుండా.. ఫోన్ పనితీరు సైతం నెమ్మదిస్తుందని పేర్కొంటున్నారు. అసలు ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? దీనిని ఎలా పరిష్కరించాలి? ఈ కథనంలో చూద్దాం.

హీటింగ్ సమస్యకు కారణాలు..

ఐఫోన్ వేడెక్కడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వారి ప్రకారం.. కొన్నిసార్లు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఉండే బగ్స్ వల్ల ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి ఫోన్ వేడెక్కే ఛాన్స్ ఉంది. హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడటం, 4K వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ చేయడం వల్ల కూడా సీపీయూ, జీపీయూ ఫుల్ స్పీడ్ తో రన్ అయ్యి మెుబైల్ హీటెక్కవచ్చు. ప్రస్తుతం వేసవిలో నేపథ్యంలో ఎండ తగిలేలా ఫోన్ ఉంచినా కూడా హీటింగ్ సమస్య వస్తుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ లో అనేక యాప్స్ రన్ కావడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ తలెత్తవచ్చు. కొన్నిసార్లు నాసిరకం ఛార్జర్లు వాడటం వల్ల కూడా పవర్ సప్లైలో హెచ్చుతగ్గులు ఏర్పడి.. హీట్ రావొచ్చు.

Advertisement

Also Read: ఇన్వర్టర్ vs కన్వర్టబుల్ ఏసీలు.. రెండింటికీ తేడా ఏంటి? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

ఫోన్ చల్లబడటానికి చిట్కాలు

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఐఫోన్ హీటింగ్ సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 35°C కంటే ఎక్కువ వేడి ఉండే ప్రదేశాల్లో ఐఫోన్‌ను ఉంచకూడదని సూచిస్తున్నారు. ఫోన్ వేడెక్కినప్పుడు వెంటనే నీడలోకి తీసుకెళ్లాలని చెబుతున్నారు. అలాగే ఫోన్ హీట్ అయినప్పుడు దాని పౌచ్ ను తీసివేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. ఐఫోన సెట్టింగ్స్ లోకి వెళ్లి తాజా iOS అప్‌డేట్‌ ఏమైనా ఉందో లేదో చూసి దానిని ఇన్ స్టాల్ చేయడం ద్వారా హీటింగ్ సమస్యను ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ కాకుండా జాగ్రత్త పడటం, ఫోన్ బ్రైట్ నెస్ ను తగ్గించడం, ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ ఆపేయండి వంటి చేయడం ద్వారా హీటింగ్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఏసీ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కుతోందా? అయితే మూడినట్లే.. వెంటనే ఇలా చేయండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×