E-Paper
Advertisement

తిరుగులేని ఫీచర్లతో iQOO Pad 6 Pro లాంచ్.. ల్యాప్‌టాప్‌కు పోటీగా 16GB RAM, భారీ స్క్రీన్!

తిరుగులేని ఫీచర్లతో iQOO Pad 6 Pro లాంచ్.. ల్యాప్‌టాప్‌కు పోటీగా 16GB RAM, భారీ స్క్రీన్!
Advertisement

iQOO Pad 6 Pro: ప్రీమియం ట్యాబ్లెట్ ప్రియుల కోసం ప్రముఖ సంస్థ iQOO సరికొత్త ‘ఐకూ ప్యాడ్ 6 ప్రో’ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. గేమింగ్, వినోదం, ఆఫీస్ పనులకు సరిపోయేలా అధునాతన ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ఐకూ ప్యాడ్ 6 ప్రో ధర ఎంత? ఫీచర్లు ఏమిటి? ఎక్కడ కొనుగోలు చేయాలి.. వంటి వివరాలను తెలుసుకుందాం.

కళ్లు చెదిరే 4K డిస్‌ప్లే:

ఈ ట్యాబ్లెట్‌లో అన్నింటికంటే ముఖ్యమైనది దీని స్క్రీన్. దీనిలో 13.2 అంగుళాల భారీ 4K ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అందువల్ల ఎండలో చూసినా స్క్రీన్ మీద అక్షరాలు క్లారిటీగా కనిపిస్తుంది. వీడియోలు చూడటానికి, గేమింగ్ ఆడుకోవడానికి ఈ స్క్రీన్ అద్భుతంగా సెట్ అవుతుంది.

తిరుగులేని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. యాండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో నడిచే ఈ ట్యాబ్లెట్‌లో ఎంత భారీ యాప్స్ వాడినా, మల్టీటాస్కింగ్ చేసినా అస్సలు హ్యాంగ్ అవ్వదు. అలాగే ట్యాబ్ వేడెక్కకుండా ప్రత్యేక త్రీడీ కూలింగ్ సిస్టమ్ కూడా అమర్చారు.

Also Read: వాట్సప్‌లో క్రేజీ ప్రైవసీ ఫీచర్.. ఇక మెసేజ్ చదవగానే మాయం!

హోమ్ థియేటర్‌లాంటి ఆడియో:

Advertisement

చాలా సన్నని డిజైన్‌తో ప్రీమియం లుక్‌లో ఉండే ఈ ట్యాబ్‌లో ఎనిమిది స్పీకర్ల పనోరమిక్ ఆడియో సిస్టమ్‌ను పెట్టారు. ఇది మంచి థియేటర్ ఫీలింగ్‌ను ఇస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఆఫీస్ డాక్యుమెంట్లు స్కాన్ చేసుకోవడానికి వెనుక వైపు 13MP కెమెరా, ఆన్‌లైన్ మీటింగ్‌ల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఇచ్చారు.

ధర వివరాలు ఇలా:

ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం లేకుండా ఈ ట్యాబ్‌లో ఏకంగా 13000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గ్రే క్రిస్టల్, సిల్వర్‌వింగ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించే ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర సుమారు రూ64,000గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ధర దాదాపు రూ.95,000 వరకు ఉంటుంది.

Also Read: వామ్మో.. రూ.63 వేలా? సోనీ కొత్త యానివర్సరీ హెడ్‌ఫోన్స్‌లో అంత స్పెషల్ ఏముందో చూసేద్దామా!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×