E-Paper
Advertisement

వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్.. 10 ఏళ్లలో 55 ట్రాన్స్‌ఫర్లు.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అరాచకం!

వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్.. 10 ఏళ్లలో 55 ట్రాన్స్‌ఫర్లు.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అరాచకం!
Advertisement

Vadde Naveen: వడ్డే నవీన్ …ఇప్పటి యూత్ కి ఈయనెవరో పెద్దగా తెలీకపోవచ్చు కాని 90s లో ఈయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో లవర్ బాయ్‌గా లేడీస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో కథానాయకుడిగా, కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసిన ఆయన, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో వెండితెరకు కాస్త దూరమయ్యారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఎటాక్’ (2016) సినిమాలో చివరిసారిగా కనిపించిన వడ్డే నవీన్, ఆ తర్వాత దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మెయిన్ లీడ్ రోల్‌లో సరికొత్త పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తుండటం ఫిలిం సర్కిల్స్ లో  హాట్ టాపిక్‌గా మారింది.

లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పేరు ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’

Advertisement

ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఈ లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పేరే ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్పణలో ‘వడ్డే క్రియేషన్స్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ యాక్షన్ డ్రామాకు కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తుండగా, వడ్డే నవీన్ కేవలం హీరోగానే కాకుండా దర్శకుడితో కలిసి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

Also read :స్టార్ హీరోల టార్గెట్ తట్టుకోలేక ముంబై చెక్కేసారా? సునీల్ నారంగ్ ప్లాన్ బి ఇదేనా?

Advertisement

ఇందులో నవీన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్‌ను లాంచ్ చేయడంతో పాటు, మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

10 ఏళ్ల సర్వీసులోనే ఏకంగా 55 సార్లు ట్రాన్స్‌ఫర్

ఈ టీజర్ విషయానికి వస్తే.. కేవలం 10 ఏళ్ల సర్వీసులోనే ఏకంగా 55 సార్లు ట్రాన్స్‌ఫర్ చేయబడిన త్రిమూర్తులు అనే ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వడ్డే నవీన్‌ను ఇంట్రడ్యూస్ చేయడంతో కథ ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. హోదా పరంగా ఆయన ఒక సాధారణ కానిస్టేబుల్ అయినప్పటికీ, డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న పవర్, నిజాయితీ ఎలాంటివో ఆ ట్రాన్స్ ఫర్ల సంఖ్యే చెబుతుంది.

Also read :సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ పోతినేని వీడియో.. అసలు విషయం తెలిసి ఫిదా అవుతున్న టాలీవుడ్

అయితే అంతటి హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన త్రిమూర్తులు, ఊహించని విధంగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక భారీ కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా మారడం టీజర్‌లో పెద్ద ట్విస్ట్. సొంత పోలీస్ డిపార్ట్‌మెంట్ వారే అతని కోసం తీవ్రంగా గాలిస్తుంటారు. తన భార్యతో కలిసి ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్న కానిస్టేబుల్ త్రిమూర్తులు అసలు దేశద్రోహిగా ఎందుకు మారాల్సి వచ్చింది, అతని వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో టీజర్ సినిమాపై క్యూరియాసిటీని విపరీతంగా పెంచేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్

ఈ టీజర్ చూస్తుంటే వడ్డే నవీన్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. క్లాస్ లుక్‌లో కనిపిస్తూనే, అదిరిపోయే రేంజ్‌లో యాక్షన్ మోడ్‌లోకి మారిపోయి నవీన్ చేసిన ఫైట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇన్నేళ్లయినా ఆయనలో అదే గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం తగ్గలేదని, 90ల కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారని  కామెంట్స్ నెట్టింట్లో గట్టిగానే వినిపిస్తున్నాయ్.

Also read :30 ఏళ్ల క్రితం చిరు ఇప్పుడు పవన్..‘మెగా 158’ వేడుకలో రివర్స్ అయిన సీన్.. వైరల్ అవుతోన్న ట్వీట్!

ఈ సినిమాలో రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, దేవీ ప్రసాద్, వివేక్ రఘువంశీ, సూర్య కుమార్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, గాయత్రి చాగంటి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటున్న ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ చిత్రం రాబోయే జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. చూడాలి మరి వడ్డే నవీన్ చేసిన ఈ సరికొత్త సాహసం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో !

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×