E-Paper
Advertisement

Iran warns Musk’s Starlink: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. తొలుత మస్క్‌ స్టార్‌లింక్, పదుల సంఖ్యలో అరెస్టులు

Iran warns Musk’s Starlink: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. తొలుత మస్క్‌ స్టార్‌లింక్, పదుల సంఖ్యలో అరెస్టులు
Advertisement

Iran warns Musk’s Starlink: ఇరాన్ యుద్ధం కొత్త టర్న్ అయ్యింది. టెక్నాలజీ వైపు దృష్టి సారించింది ఆ దేశం. తమ స్థావరాల గురించి కీలక విషయాలు బయటకు రావడంపై ఆదేశం మండిపడుతోంది. దీని వెనుక ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉందని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఘాటు వార్నింగ్ ఇచ్చింది. మస్క్ స్టార్‌లింక్‌ను తాము వదిలిపెట్టేది లేదని తేల్చేసింది.

ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. తొలుత మస్క్‌ స్టార్‌లింక్

Advertisement

తమ స్థావరాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా మెరుపు దాడులు చేయడం వెనుక మూలాలపై ఫోకస్ చేసింది ఇరాన్. పొరుగు దేశాల్లో అమెరికా, ఆదేశాల కంపెనీల ఆస్తులు లక్ష్యంగా దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థపై విరుచుకు పడతామని చెప్పకనే చెప్పింది.

గల్ఫ్ వ్యాప్తంగా స్టార్ లింక్ నెట్‌వర్క్ బలంగా విస్తరించింది. ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్, యూఏఈ దేశాల్లో ఆ సంస్థదే కీలక పాత్ర. స్టార్ ‌లింక్ సంస్థ గల్ఫ్ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తరచూ ఇంటర్నెట్ బ్లాక్‌ అవుతోంది.

Advertisement

స్టార్‌లింక్ సదుపాయాలపై ఫోకస్.. పదుల సంఖ్యలో అరెస్టులు

ఈ సమస్య అధిగమించేందుకు పలు దేశాలు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నాయి. దీన్ని పసిగట్టిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా హెచ్చరికలు చేసింది. ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో సంబంధం ఉన్న 18 టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు స్టార్‌లింక్ కేంద్రంగా మారింది.

ఇందులో భాగంగా ఇరాన్‌లోని యజ్ద్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగదారులకు చెందిన 61 బ్యాంకు ఖాతాలను నిలిపి వేసినట్టు ఆదేశ పోలీసులు వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో సోదాల తర్వాత ఆరు స్టార్‌లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీస్ కమాండర్ వెల్లడించారు.

ALSO READ: చైనా బ్రాండ్లకు చెక్.. భారత్‌లో ఇకపై ఈ 5 మేక్ ఇన్ ఇండియా CCTV కెమెరాలదే హవా!

సర్వీసు పేరుతో విదేశీ సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం, శత్రువులకు సమాచారం అందజేయడం వంటి అభియోగాలు వారిపై మోపారు. ఇరాన్ వ్యాప్తంగా ఈ తరహా అరెస్టుల పరంపర జోరుగా సాగుతోంది. విదేశీ మీడియాతో పరిచయాలు, ఆన్‌లైన్ కార్యకలాపాలు. భద్రతా సంబంధిత ఆరోపణలపై అధికారులు ఇటీవలికాలంలో పదుల సంఖ్యలో చాలామందిని అదుపులోకి తీసుకున్నారు.

పలు ప్రావిన్సులలో స్టార్‌లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇరాన్‌లో మస్క్ స్టార్‌లింక్‌ని నిషేధించింది. యుద్ధ సమయంలో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. కనెక్టివిటీ సాధారణ స్థాయిల నుండి సుమారు ఒక శాతానికి పడిపోయింది. దీంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి శాటిలైట్ సేవలు మిగిలిన కొన్ని మార్గాలలో ఒకటిగా మిగిలిపోయాయని పర్యవేక్షణ సంస్థ నెట్‌బ్లాక్స్ చెబుతున్నమాట.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×