E-Paper
Advertisement

Induction Buying Tips: కొత్త ఇండక్షన్ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలియకపోతే మీ డబ్బు వృథా!

Induction Buying Tips: కొత్త ఇండక్షన్ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలియకపోతే మీ డబ్బు వృథా!
Advertisement

Induction Buying Tips: ఇండక్షన్ స్టవ్ కొనడానికి ప్రస్తుతం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ తో పోలిస్తే ఇది చాలా సేప్. అంతే కాకుండా దీనిని ఈజీగా శుభ్రం చేయొచ్చు కూడా. ఇదిలా ఉంటే.. కొనేముందు చాలా మంది దీని డిజైన్ అంతే కాకుండా బ్రాండ్ చూసి కొనుగోలు చేస్తుంటారు. కానీ.. ఇండక్షన్ స్టవ్ తీసుకునే కరెంట్ , వంట పాత్రల సామర్థ్యంతో పాటు , సేఫ్టీ ఫీచర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు కొత్తగా ఇండక్షన్ కొనాలని అనుకుంటే.. డిజైన్ కాకుండా పరిశీలించాల్సిన 4 ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండక్షన్ కుక్‌టాప్ కొనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మీ వంటగదికి సరైన ఇండక్షన్ తీసుకోవడం వల్ల కరెంట్ ఆధా అవడమే కాకుండా మీ వంట పని ఈజీ అవుతుంది. డిజైన్ పక్కన పెడితే మీరు చూడాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే..

Advertisement

1. వాటేజ్, పవర్ లెవల్స్:
ఇండక్షన్ పనితీరులో ‘వాటేజ్’ చాలా ముఖ్యం. వాటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే, వంట అంత వేగంగా పూర్తవుతుందని గమనించాలి. సాధారణంగా ఇంటి అవసరాలకు 1800W నుంచి 2100W సామర్థ్యం గల కుక్‌టాప్‌లు తీసుకోవడం ముఖ్యం. పవర్ లెవల్స్ సంఖ్యను కూడా తప్పకుండా గమనించాలి. ఎక్కువ పవర్ లెవల్స్ ఉంటే.. మీరు మంటను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. ఉదాహరణకు.. పాలు కాచడానికి తక్కువ వేడి, వేపుళ్లకు ఎక్కువ వేడి అవసరమవుతుంది. కాబట్టి కనీసం 6 నుంచి 10 పవర్ లెవల్స్ ఉన్న మోడల్‌ను తీసుకోవడం మంచిది.

2. కాయిల్ నాణ్యత, పరిమాణం:
పెద్ద కాయిల్: మీరు వాడే పాత్ర పరిమాణానికి తగ్గట్టుగా కాయిల్ ఉండాలి. కాయిల్ చిన్నదైతే.. పాత్ర అడుగు భాగం మొత్తం సమానంగా వేడెక్కదు. ఫలితంగా వంట కూడా సరిగ్గా ఉడకదు.

Advertisement

మెటీరియల్: ఎల్లప్పుడూ 100% కాపర్ కాయిల్ ఉన్న కుక్‌టాప్‌లనే ఎంచుకోండి. ఇవి వేడిని త్వరగా గ్రహిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అల్యూమినియం కాయిల్స్ తక్కువ ధరకే ఉన్నప్పటికీ.. అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

3. సేఫ్టీ ఫీచర్లు :
ఇండక్షన్ స్టవ్‌లు కరెంట్ తో పాటు పనిచేస్తాయి కాబట్టి సేఫ్టీ గురించి తప్పకుండా ఆలోచించాలి. ఇండక్షన్‌కు ఈ క్రింది ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి.

ఆటో-కటాఫ్: ఒకవేళ మీరు స్టవ్ పైన పాత్ర పెట్టడం మర్చిపోయినా.. లేదా పాత్రలో ఆహారం అడుగంటినా.. ఇది ఆటోమేటిక్‌గా పవర్‌ను నిలిపివేస్తుంది.

చైల్డ్ లాక్: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారు పొరపాటున బటన్లను నొక్కకుండా ఉండటానికి ఈ ఫీచర్ చాలా అవసరం.

ఓవర్ హీట్ ప్రొటెక్షన్: స్టవ్ లోపలి భాగాలు అధికంగా వేడెక్కినప్పుడు ఇది సర్క్యూట్‌ను ఆఫ్ చేసి ప్రమాదాలను నివారిస్తుంది.

4. పాన్ సైజు, ప్రీ-సెట్ మెనూ:
పాన్ డిటెక్షన్: స్టవ్ మీద ఇండక్షన్ ఫ్రెండ్లీ పాత్ర ఉంటేనే ఇది పని చేయాలి. పాత్రను తీసేయగానే వేడి ఆగిపోవడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది.

ఇండియన్ మెనూ ఆప్షన్స్: మన దేశంలో దొరికే చాలా కుక్‌టాప్‌లలో ఇడ్లీ, దోస, కర్రీ, పాలు మరిగించడం వంటి పనుల కోసం ప్రత్యేక బటన్లు ఉంటాయి. ఇవి వంటను మరింత ఈజీ చేస్తాయి. టైమర్ ఫీచర్ ఉంటే.. నిర్ణీత సమయం తర్వాత స్టవ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీని వల్ల వంట మాడిపోయే భయం ఉండదు.

ఇండక్షన్ కుక్‌టాప్ అనేది కేవలం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మాత్రమే కాదు. అది మీ వంట గదిలోని వేగాన్ని, సేఫ్టీని ప్రభావితం చేస్తుంది. కేవలం గ్లాస్ టాప్ ఫినిషింగ్ లేదా తక్కువ ధరను చూసి మోసపోకుండా.. పైన పేర్కొన్న వాటేజ్, కాయిల్ నాణ్యత, సేఫ్టీ ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించి కొనండి.

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×