E-Paper
Advertisement

ఇషాన్ కిష‌న్ కు తీవ్ర గాయం, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్‌, SRH కెప్టెన్ గా అభిషేక్ శ‌ర్మ‌ !

ఇషాన్ కిష‌న్ కు తీవ్ర గాయం, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్‌, SRH కెప్టెన్ గా అభిషేక్ శ‌ర్మ‌ !
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఒత్తిడిలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ కు ( SRH Ishan kishan) గాయమైనట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. దీంతో ఇవాళ కేకేఆర్ తో జరిగే మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ( Ishan kishan Injured) ఆడేది డౌట్ అని అంటున్నాడు. దీంతో హైదరాబాద్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ఇషాన్ కిషన్ తుది జట్టులో ఆడకపోతే అతని స్థానంలో డేంజర్ ఆటగాడు లియాన్ లివింగ్ స్టన్ ( Liam Livingstone ) బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

ఇషాన్ కిష‌న్ కు తీవ్ర గాయం, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్‌ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొట్ట మొదటి మ్యాచ్ లోనే దారుణంగా ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను చెత్త బౌలింగ్ కారణంగా పోగొట్టుకుంది. ఇక ఇప్పుడు కేకేఆర్ తో నేడు మ్యాచ్ ఆడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ కు గాయమైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తుండగా అతడు గాయపడ్డాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కు ఇషాన్ కిషన్ దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇదే జరిగితే అభిషేక్ శర్మకు కెప్టెన్సీ రానున్నట్లు తెలుస్తోంది. కమిన్స్ గాయం కారణంగా జట్టుకు దూరంగానే ఉంటున్నారు. అందుకే అభిషేక్ కు కెప్టెన్సీ ఇస్తారు. అటు ఇషాన్ కిషన్ జట్టుకు దూరమైతే లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులోకి వస్తాడు. అదే జరిగితే మెండిస్ కు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 10 మాత్రమే గెలవగా కేకేఆర్ మాత్రం 20 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

Advertisement

 

 

కోల్‌కతా వర్సెస్ సన్ రైజర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII: అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీప‌ర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ, కార్తీక్ త్యాగి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (c & wk), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, డేవిడ్ పేన్/జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

https://www.threads.com/@sunrisersfansofficial/post/DWkzZP0mewm?xmt=AQF0VbCInBvG7DF6cfPrv1e0cQmK1IespMc3qywDFgrUnXF-MD4i8RoWn0FaQqvTC16TIlA&source_surface=35&slof=1

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×