E-Paper
Advertisement

ఫోన్ పాడైతే ఇంటికొచ్చి మరీ రిపేర్ చేస్తారు.. రూ.10వేల బడ్జెట్‌లో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ వచ్చేస్తోంది!

ఫోన్ పాడైతే ఇంటికొచ్చి మరీ రిపేర్ చేస్తారు.. రూ.10వేల బడ్జెట్‌లో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ వచ్చేస్తోంది!
Advertisement

Lava Bold N2 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా.. బడ్జెట్ ధరలో సరికొత్త 5G ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గతంలో తీసుకొచ్చిన 4G మోడల్‌కు మంచి స్పందన రావడంతో.. ఇప్పుడు Lava Bold N2 5G వేరియంట్‌ను తీసుకువస్తోంది. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీ ఇప్పటికే అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఆకట్టుకునే డిజైన్..

ఈ కొత్త 5G ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో రానుంది. ఫోన్ వెనుక భాగంలో ఎడమ వైపున చతురస్రాకారపు (స్క్వేర్ షేప్) కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 13MP వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో స్టైలిష్‌గా కనిపించే ఫోన్ కోసం చూసేవారికి ఈ డిజైన్ బాగా నచ్చుతుంది.

Advertisement

Also Read: OnePlus 16 ప్రైస్ లీక్.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ ఒక్క విషయంలోనే సస్పెన్స్!

క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఎక్స్‌పీరియన్స్..

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని సాఫ్ట్‌వేర్ అనే చెప్పాలి. Lava Bold N2 5G ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కంపెనీ దీనిలో ఎలాంటి అనవసరమైన యాప్స్ (బ్లోట్‌వేర్), విసుగు పుట్టించే యాడ్స్ ఉండవని స్పష్టం చేసింది. దీనివల్ల యూజర్లకు ఎంతో స్మూత్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభూతి లభిస్తుంది.

ఉచిత హోమ్ సర్వీస్ సపోర్ట్..

Advertisement

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు లావా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఇంటి వద్దే మొబైల్ సర్వీస్ (ఫ్రీ హోమ్ సర్వీస్) సపోర్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాల్లో ఉండే వారికి ఈ సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

ఫీచర్లు (అంచనా):

పాత 4G మోడల్‌తో పోలిస్తే.. ఈ 5G ఫోన్‌లో మరిన్ని అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. గత 4G వేరియంట్ 6.75 ఇంచుల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, 4GB RAMతో వచ్చింది. ఇప్పుడు రాబోయే 5G మోడల్ పూర్తి స్పెసిఫికేషన్లు లాంచ్ రోజున తెలియనున్నాయి. మార్కెట్లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కంపెనీ దీని ధరను ఎంతవరకు అందుబాటులో ఉంచుతుందో చూడాలి.

Also Read: శాంసంగ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్ తక్కువలో కావాలా? అయితే అమెజాన్‌లో ఈ ఆఫర్ చూస్తే ఎగిరి గంతేస్తారు!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×