E-Paper
Advertisement

OnePlus 16 ప్రైస్ లీక్.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ ఒక్క విషయంలోనే సస్పెన్స్!

OnePlus 16 ప్రైస్ లీక్.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ ఒక్క విషయంలోనే సస్పెన్స్!
Advertisement

OnePlus 16 Leaks: టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ తదుపరి ఫ్లాగ్‌షిప్ మొబైల్ OnePlus 16 గురించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా డిస్‌ప్లే, కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో ఈ ఫోన్ సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు అల్ట్రా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా వన్ ప్లస్ ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తోంది.

అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే..

ఈ కొత్త ఫోన్‌లో డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో 240Hz రిఫ్రెష్‌రేట్ ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం కంపెనీ 185Hz రిఫ్రెష్‌రేట్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. 6.78 ఇంచుల అల్టిమేట్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో రాబోతున్న ఈ ఫోన్ బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. గేమింగ్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు టచ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండేలా ప్రత్యేక టెక్నాలజీని వాడుతున్నారు.

మైండ్ బ్లోయింగ్ కెమెరా..

Advertisement

కెమెరా పరంగా వన్‌ప్లస్ ఈసారి పెద్ద సాహసమే చేస్తోంది. దీని వెనుక భాగంలో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మెయిన్ కెమెరాగా 50MP సెన్సార్, మరో 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Also Read: జస్ట్ రూ.15 ఖర్చు పెడితే చాలు.. ఇల్లంతా కూల్ అయిపోద్ది.. ఇక ఏసీ కూడా ఆన్ చేయరు!

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో రన్ కానుంది. దీనికి తోడు ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రీమియం ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 17తో పాటు ప్రత్యేకంగా ఒక ఏఐ (AI) బటన్‌ను కూడా ఇందులో ఇవ్వబోతున్నారు.

ఇండియా లాంచ్ సస్పెన్స్..

అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. అయితే భారత్‌లో దీని లాంచ్ త్వరగా ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంపెనీ ఇక్కడి మార్కెట్లో మిడ్‌రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ పెట్టడమే దీనికి కారణం. ఇక ధర విషయానికొస్తే..OnePlus 16 బేస్ వేరియంట్ దాదాపు రూ.75,999 ఉండవచ్చని అంచనా. భవిష్యత్తులో కంపెనీ ఇచ్చే అధికారిక ప్రకటనతోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!

Related News

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

Big Stories

Advertisement
×