E-Paper
Advertisement

Lava Play Max 5G: గేమింగ్ బీస్ట్ వచ్చేసింది.. వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో ‘లావా ప్లే మ్యాక్స్’ అధికారికంగా లాంచ్!

Lava Play Max 5G: గేమింగ్ బీస్ట్ వచ్చేసింది.. వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో ‘లావా ప్లే మ్యాక్స్’ అధికారికంగా లాంచ్!
Advertisement

Lava Play Max 5G: భారతీయ బ్రాండ్ లావా తన Play సిరీస్‌లో కొత్తగా Lava Play Max 5Gను దేశీయ మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. Play అల్ట్రాకు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ మోడల్ తక్కువ ధరలోనే శక్తివంతమైన 5G పనితీరు, స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో MediaTek Dimensity 7300 (4nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా వేపర్ ఛాంబర్ కూలింగ్ను తీసుకురావడం లావా స్పెషల్. 6.72 అంగుళాల FHD+ స్క్రీన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, స్క్రోలింగ్ మరింత సులభంగా అనిపిస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇలా:

గేమింగ్‌ ప్రేమికులకు ఈ మోడల్ నిజంగా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. 8GB LPDDR4X RAMతో పాటు అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ మరింత మెరుగ్గా సాగుతాయి. స్టోరేజీ పరంగా చూసుకుంటే 128GB UFS 3.1 అందించబడింది. అవసరమైతే microSD ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

Advertisement

Read Also: నమ్మశక్యం కాని ధరకు ఐఫోన్ 16 ప్రో.. ఇంత డిస్కౌంట్ ఎప్పుడూ చూసి ఉండరు!

కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా EIS సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 4K 30fps వీడియో రికార్డింగ్ అందిస్తుంది. ఫ్రంట్‌లో 8MP సెల్ఫీ కెమెరాని అమర్చారు. ఈ ఫోన్ Android 15పై నడుస్తూ, ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ UI అనుభవాన్ని ఇస్తుంది.

Advertisement

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. లావా ప్లే మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్ధతు ఇస్తుంది. అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ లాంటి రోజువారీ వాడకంలో ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ Lava Play Max 5G హ్యాండ్ సెట్ డెక్కన్ బ్లాక్, హిమాలయన్ వైట్‌గా రెండు కలర్స్‌లో లభిస్తుంది.

ధర ఎంతంటే?

ఇక ధరలు చూస్తే.. 6GB + 128GB వేరియంట్‌కు రూ.12,999 ధర ఉండగా.. 8GB + 128GB వేరియంట్‌కు రూ.14,999గా ధరను నిర్ణయించారు. ఈ లావా ప్లే మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్స్  దేశవ్యాప్తంగా ఉన్న లావా స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇకపోతే గేమింగ్ లవర్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సంస్థ తెలిపింది.

Read Also: రెడ్‌మీ నోట్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా?.. మిస్ చేసుకుంటే కచ్చితంగా ఫీలవుతారు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×