E-Paper
Advertisement

Gold Rate Increased: పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు..

Gold Rate Increased: పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు..
Advertisement

Gold Rate Increased: ఓర్నాయనో.. బంగారం ధరలు ఇలా షాక్ ఇస్తున్నాయి ఏంటి..? నిన్నమొన్నటి వరకు కాస్తా తక్కువగా పెరిగిన పసిడి ధరలు నేడు ఒక్క రోజు భారీగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు బంగారం కొనాలంటే పసిడి ప్రియులు భయపడిపోతున్నారు. ఇంకా ముఖ్యంగా సామాన్య ప్రజలు అయితే బంగారం వైపు కన్నెత్తి చూడాలన్న భయపడుతున్నారు. నేటి పసడి ధరలు ఎలా ఉన్నాయంటే..

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,750 ఉండగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,660 వద్ద కొనసాగుతోంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,850 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,600 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,910 పెరిగింది.

Advertisement

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారతదేశంలో గత కొద్ది నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం, అప్పట్లో ట్రంప్ విధించిన సుంకాలు ఒకటి కారణం అయితే.. ఇప్పుడు అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు.. మరి ముఖ్యంగా పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా రేట్లు తగ్గకపోవడంతో.. పెట్టుబడి దారులు అధిక రాబడులను ఆశించడంతో బంగారం పెరగడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,32,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,600 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,600 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,600 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,810 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,21,750 వద్ద పలుకుతోంది.

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడికి అడ్లకాడతో వాతలు పెట్టిన టీచర్

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మే.. బంగారం కంటే సిల్వర్ ధరలు అత్యంత భారీగా పెరిగిపోతున్నాయి.. ఎంత తొందరగా వెండి రేటు తగ్గి కిందకు వచ్చిందో మళ్లీ అంతే తొందరగా పెరిగి రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,09,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,15,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.6,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,04,000లు కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×