E-Paper
Advertisement

Lava Play Max 5G Smartphone: ఏఐ కెమెరాతో వచ్చేస్తోన్న లావా న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌!

Lava Play Max 5G Smartphone: ఏఐ కెమెరాతో వచ్చేస్తోన్న లావా న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌!
Advertisement

Lava Play Max 5G Smartphone: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ దిగనుంది. Lava Play Max 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో ఈ నెలలోనే విడుదల కానుందని లీక్స్ సూచిస్తున్నాయి. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ అనే ప్రముఖ లీకర్ తన X హ్యాండిల్‌ ద్వారా అనేక వివరాలను వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే లావా కొత్త ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇకపోతే Lava Play Max 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపారు. ఇలాంటి చిప్‌ను లావా ప్లే అల్ట్రా 5G ఫోన్‌లోనూ వినియోగించారు. ఈ ఫోన్ యొక్క చిప్‌సెట్‌ 8GB ర్యామ్, UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

కెమెరా విషయానికొస్తే:

Advertisement

Lava Play Max 5G హ్యాండ్ సెట్ కెమెరా పరంగా చూస్తే.. వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీనిలో EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ఏఐ కెమెరా, మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

Read Also: ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ!

Advertisement

ఈ లావా ప్లే మ్యాక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్.. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు వేపర్‌ ఛాంబర్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఎంత ధర ఉండొచ్చు?

Lava Play Max 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర‌ రూ.15,000 సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధర గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. కాకపోతే త్వరలో ఈ వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

లావా అగ్ని 4 ఫోన్‌‌పై డిస్కౌంట్‌:

ఈ ఏడాది నవంబరులో లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. 8GB RAM+ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మీద ఎంపికం చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

ఈ లావా అగ్ని 4 5జీ ఫోన్.. 6.67 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెట్‌‌టచ్‌ ఫీచర్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లు సైతం ఉన్నాయి. ఇది 66W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌‌లో యాక్షన్ కీ, Vayu AI ఫీచర్‌ కూడా ఉంటుంది.

ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా.. 50MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కలిగి ఉన్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP EIS కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది.

Read Also: అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మీ నార్జో 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.10999 మాత్రమే!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×