E-Paper
Advertisement

Oppo Find N6 Foldable: ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ!

Oppo Find N6 Foldable: ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ!
Advertisement

Oppo Find N6 Foldable: మంచి ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్ కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి Oppo Find N6 Foldable ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ Oppo Find N5కి సక్సెసర్‌గా ఉండనుంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ ఒప్పో ఫైండ్ N6 ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుత ఫోల్డబుల్ ఫోన్‌ల కంటే అత్యంత సన్నగా, తేలికగా ఉండనుందట. త్వరలో విడుదల కానున్న ఈ న్యూ ఫోల్డబుల్ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

ఒప్పో ఫైండ్ N6 కీలక స్పెసిఫికేషన్లు:

ఈ ఒప్పో ఫైండ్ N6 ఫోల్డబుల్ ఫోన్.. ఇప్పటికే టెస్టింగ్‌లో ఉందని సమాచారం. అయితే, దీని గురించి సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రణాళికలను ప్రకటించనప్పటికీ.. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈ ఒప్పో ఫైండ్ N6ను ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ బ్రాండ్ కింద రీబ్రాండ్ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఉదా: వన్‌ప్లస్ ఓపెన్ ఒప్పో ఫైండ్ N3 గ్లోబల్ వెర్షన్‌గా విడుదల చేశారు. కానీ, తాగాజా ఒప్పో నుంచి రానున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయితే.. అది వన్‌ఫ్లస్ పేరుతో వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Advertisement

Read Also: భారత మార్కెట్లోకి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ లైఫ్, AI కెమెరాతో పిచ్చ క్లారిటీ!

శాటిలైట్ కమ్యూనికేషన్‌కు మద్ధతు:

తాగాజా విడుదలైన లీక్‌ల ప్రకారం.. ఒప్పో ఫైండ్ 6N స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని టాప్ వేరియంట్ శాటిలైట్ కమ్యూనికేషన్‌కు మద్దతు ఇవ్వచ్చని సమాచారం. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోనుల్లో సర్వసాధారణంగా మారుతోంది. ఒప్పో ఫైండ్ 6N ఫోల్డబుల్ ఫోన్ 8.1-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 6.6-అంగుళాల బయట స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వచ్చు, కస్టమైజ్డ్ బటన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయని సమాచారం.

ఇతర ఫీచర్లు చూసుకుంటే:

Advertisement

ఇక ఇంటర్నల్ స్టోరేజీ విషయానికిస్తే.. ఈ పోన్ 6,000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. ఒకపోతే ఫొటోగ్రఫీ కోసం.. ఈ ఫోల్డబుల్ ఫోన్ 50MP సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్, టెలిఫొటో షాట్‌ల కోసం 50MP 3x పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ టెస్టింగ్‌లో Oppo త్వరలో ఫైండ్ N6ని మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థ ఇంకా అధికారిక లాంచ్ టైమ్‌లైన్ వెల్లడించలేదు. ఇది ఆండ్రాయిడ్ 16, కలర్ OS 16తో రానుందని, 2026 మొదటి త్రైమాసికంలో విడుదల కావచ్చని అంచనా.

Read Also: అబ్బురపరిచే ఫీచర్లతో వన్‌ఫ్లస్ న్యూ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్లు తెలిస్తే షేకైపోతారు బాసూ!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×