E-Paper
Advertisement

ఫ్యాబ్రిక్‌ను బట్టి వాషింగ్,ఎల్‌జీ వాషింగ్ మెషీన్‌‌లో.. ఇవేం ఫీచర్లు బాబోయ్

ఫ్యాబ్రిక్‌ను బట్టి వాషింగ్,ఎల్‌జీ వాషింగ్ మెషీన్‌‌లో.. ఇవేం ఫీచర్లు బాబోయ్
Advertisement

LG Smart Choice Washer Dryer: ప్రస్తుత కాలంలో మహిళల పనిని సులువు చేస్తూ ప్రముఖ హోమ్ అప్లయన్స్ బ్రాండ్ ఎల్‌జీ సరికొత్త వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే ‘ఎల్‌జీ స్మార్ట్ ఛాయిస్ 9 కేజీ వాష్ / 5 కేజీ డ్రై’ (LG Smart Choice 9 Kg/5 Kg) వాషర్ డ్రైయర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టీమ్ క్లీనింగ్ , ఇన్ బిల్ట్ డ్రైయింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ ధర ఎంత? దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది మీ ఇంటికి ఎలాంటి స్మార్ట్ ఎంపిక అవుతుందో వివరంగా తెలుసుకుందాం.

బెస్ట్ ఫీచర్లు:

Advertisement

స్మార్ట్ టెక్నాలజీ యుగంలో వాషింగ్ మెషీన్ల వాడకం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా బట్టలు ఉతికిన తర్వాత వాటిని ఆరబెట్టడం పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఎల్‌జీ సంస్థ వాషర్ , డ్రైయర్ రెండూ ఒకే మెషీన్‌లో ఉండేలా ఈ సరికొత్త ఫ్రంట్ లోడ్ మోడల్‌ను డిజైన్ చేసింది.ఈ మెషీన్ 9 కేజీల వాషింగ్ కెపాసిటీ, 5 కేజీల పూర్తి డ్రైయింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే.. ఇందులో బట్టలు ఉతకడమే కాకుండా 100 శాతం తడి లేకుండా పూర్తిగా ఎండిపోయి బయటకు వస్తాయి. పెద్ద కుటుంబాలకు లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు సమయాన్ని ఆదా చేయడానికి ఇదొక అద్భుతమైన హోమ్ అప్లయన్స్ అని చెప్పొచ్చు. దీని ధర మార్కెట్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆఫర్లను బట్టి రూ.50,000 నుంచి రూ. 58,000 మధ్య అందుబాటులో ఉంది.

ఏఐ డైరెక్ట్ డ్రైవ్:
ఈ వాషింగ్ మెషీన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీనిలోని ఏఐ డైరెక్ట్ డ్రైవ్ (AI DD – Artificial Intelligence Direct Drive) టెక్నాలజీ. ఇది మెషీన్‌లో వేసిన బట్టల బరువును మాత్రమే కాకుండా.. ఆ ఫ్యాబ్రిక్ (కాటన్, సిల్క్, నైలాన్ మొదలైనవి) మెత్తదనాన్ని కూడా స్వయంగా గుర్తిస్తుంది. ఆ డేటా ఆధారంగా బట్టలు పాడవకుండా ఉండేందుకు తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్స్‌ను మెషీన్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల సాధారణ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే.. బట్టల మన్నిక దాదాపు 18 శాతం పెరుగుతుందని ఎల్‌జీ పేర్కొంది. బెల్ట్ , పుల్లీ లేకుండా నేరుగా మోటార్‌ను డ్రమ్‌కు కనెక్ట్ చేయడం వల్ల వైబ్రేషన్, శబ్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కరెంట్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది.

Advertisement

ఫీచర్ ఎల్‌జీ స్టీమ్:
ఇందులోని మరొక అద్భుతమైన ఫీచర్ ఎల్‌జీ స్టీమ్ (LG Steam) టెక్నాలజీ. ఈ ఫీచర్ ద్వారా వేడి నీటి ఆవిరితో బట్టలను క్లీన్ చేయడం జరుగుతుంది.ఇది బట్టలపై ఉండే కంటికి కనిపించని అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను 99.9% వరకు పూర్తిగా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో.. చిన్న పిల్లలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు ఉన్నప్పుడు ఈ స్టీమ్ వాష్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా..స్టీమ్ వల్ల బట్టలపై ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. దీని వల్ల ఇస్త్రీ చేసే పని కూడా సులువవుతుంది. స్మార్ట్ థింక్యు వైఫై కనెక్టివిటీ ద్వారా.. ఈ మెషీన్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా కొత్త వాష్ సైకిల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: ఈఫ్యాన్లతో క్షణాల్లోనే.. ఇల్లంతా కూల్ కూల్!

ధర:
ధర, ఫీచర్ల పరంగా చూస్తే..కస్టమర్లు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడుతున్నారు.ఎల్‌జీ అందిస్తున్న ఈ స్మార్ట్ ఛాయిస్ మోడల్ 5 స్టార్ఎ నర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి కరెంట్ బిల్లు భారం కూడా ఉండదు. మోటార్‌పై ఎల్‌జీ సంస్థ 10 ఏళ్ల వారంటీని అందిస్తోంది. ఇది కస్టమర్లు నమ్మకాన్ని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే..లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, ఇన్-బిల్ట్ హీటర్ డ్రైయర్, హెల్తీ స్టీమ్ వాష్ కోరుకునే వారికి.. ఈ బడ్జెట్‌లో ఇదొక బెస్ట్ ప్రీమియం వాషింగ్ మెషీన్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×