E-Paper
Advertisement

ఫోన్ పోగొట్టుకుంటే.. తొలి 15 నిమిషాల్లో చేయాల్సిన.. 5 అత్యవసర పనులు ఇవే!

ఫోన్ పోగొట్టుకుంటే.. తొలి 15 నిమిషాల్లో చేయాల్సిన.. 5 అత్యవసర పనులు ఇవే!
Advertisement

Phone Safety Tips: ఫోన్ పోగొట్టుకున్నా? లేదా దొంగతనానికి గురైనా? తొలి 15 నిమిషాలు అత్యంత చాలా కీలకమని నిపుణులు చెబుతుంటారు. ఆ సమయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. బ్యాంక్ ఖాతాలను, వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుతాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఫోన్ పోతే.. వెంటనే చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం.

సిమ్ కార్డ్‌ బ్లాక్

ఫోన్ పోయిన వెంటనే చేయాల్సిన మొదటి పని సిమ్ కార్డ్ బ్లాక్. టెలికాం ఆపరేటర్‌కు (Airtel, Jio, Vi, BSNL) కాల్ చేసి సిమ్ కార్డ్‌ను తక్షణమే బ్లాక్ చేయమని సూచించండి. తద్వారా దొంగలు ఆ సిమ్ కార్డ్‌ను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల OTPలను పొందకుండా అడ్డుకోవచ్చు. అదే సమయంలో మీ నెంబర్ నుంచి ఇతరులకు కుట్రపూరిత కాల్స్ చేయకుండా కట్టడి చేయవచ్చు.

బ్యాంకింగ్, యూపీఐ యాప్స్

Advertisement

ప్రస్తుతం అందరి ఫోన్లలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లతో పాటు నెట్ బ్యాంకింగ్ యాప్స్ తప్పనిసరిగా మారిపోయాయి. కాబట్టి ఫోన్ పోయిన వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. మీ ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయమని సూచించండి. దీనివల్ల మీ అనుమతి లేకుండా బ్యాంక్ ఖాతా నుండి ఒక్క రూపాయి కూడా వేరొకరు డ్రా చేసేందుకు అవకాశం ఉండదు.

ఫోన్ డివైజ్ లాక్..

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ‘ఫైండ్ మై డివైజ్’ ద్వారా.. ఐఫోన్ వాడుతుంటే ‘Find My’ ఫీచర్ ద్వారా మరొక ఫోన్ లేదా కంప్యూటర్ నుండి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు. ఒకవేళ ఫోన్ తిరిగి దొరికే అవకాశం లేదని భావిస్తే.. అందులోని ‘Erase Data’ ఆప్షన్ ద్వారా మీ పర్సనల్ ఫోటోలు, డాక్యుమెంట్లను రిమోట్‌గా పూర్తిగా డిలీట్ చేయండి.

పాస్‌వర్డ్‌లు మార్చండి

Advertisement

ఫోన్ లాక్‌ని దొంగలు ఒకవేళ బ్రేక్ చేసినా వ్యక్తిగత సమాచారం వారికి చిక్కకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం జీమెయిల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్పప్ వంటి కీలక ఖాతాల పాస్ వార్డ్ లను వెంటనే మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే పాత ఫోన్ నుండి ఆయా ఖాతాలు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతాయని స్పష్టం చేస్తున్నారు.

Also Read: మొబైల్ డేటా సగం రోజుకే అయిపోతోందా? అయితే ఈ 4 ట్రిక్స్ మీ కోసమే!

IMEI నెంబర్ సాయంతో బ్లాక్

సాధారణంగా ప్రతీ ఫోన్ బాక్స్ లేదా బిల్లుపై ఉండే 15 అంకెల IMEI నంబర్‌ ఉంటుంది. దాని ఆధారంగా మీ ఫోన్ ను పనిచేయకుండా బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందించిన CEIR (Central Equipment Identity Register) వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేయండి. దీనివల్ల దొంగిలించబడిన మీ ఫోన్‌లో ఏ ఇతర సిమ్ కార్డ్ వేసినా అది పనిచేయకుండా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది.

Also Read: క్రోమా నమ్మశక్యం కాని ఆఫర్.. సగం ధరకే సరికొత్త ‘ఐఫోన్ 17’.. చార్జర్ కూడా ఫ్రీ!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×