Croma iPhone Sale: యాపిల్ ఉత్పత్తులను ఇష్టపడే వారికి క్రోమా సరికొత్త తీపి కబురు అందించింది. భారీ డిస్కౌంట్లతో కూడిన ‘ఎవ్రీథింగ్ యాపిల్’ (Everything Apple) సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా సరికొత్త ఐఫోన్ 17 (iPhone 17)పై ఊహించని రేంజ్‌లో ఆఫర్లను ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ప్రీమియం ఫోన్ కేవలం రూ. 44,768 లకే లభిస్తుండటం విశేషం. దీనికి తోడు వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్‌గా ఉచిత అడాప్టర్‌ను కూడా క్రోమా అందిస్తోంది.
సాధారణంగా యాపిల్ ఐఫోన్ల ధరలు సామాన్యులకు కాస్త భారంగానే ఉంటాయి. అయితే క్రోమా ఈసారి బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అద్భుతంగా కలగలిపి ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే లేటెస్ట్ ఐఫోన్ 17 (256GB) ను ఆఫర్ చేస్తోంది. ఫలితంగా రూ.82,900 విలువైన ఫోన్ ను రూ.44,768కు సొంతం చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు లభిస్తోంది. సేల్ లో భాగంగా రూ.1000 బ్యాంక్ క్యాష్ బ్యాక్ తో పాటు రూ.1,658 విలువైన డిస్కౌంట్ కూపన్ ను కస్టమర్లకు క్రోమా అందిస్తోంది.
అదే విధంగా అర్హత గల డివైజ్ లపై రూ.8,000 వరకూ ఎక్స్ ఛేంజ్ బోనస్ పొందొచ్చు. దీనికి తోడు పాత ఫోన్ ను మార్చుకోవడం ద్వారా గరిష్టంగా రూ.23,500 ఎక్స్ ఛేంజ్ వాల్యూ పొందొచ్చు. దీంతో పాటు రూ.4,974 వరకూ విలువైన టాటా న్యూ కాయిన్స్ ను కూడా ఆఫర్లలో అందిస్తున్నారు. ఈ బెనిఫిట్స్ అన్ని కలుపుకుంటే.. ఐఫోన్ 17పై రూ.44,768కు డిస్కౌంట్ కస్టమర్లకు లభించనుంది.
గత కొన్ని సిరీస్‌ల నుండి యాపిల్ సంస్థ ఐఫోన్ బాక్స్‌లో చార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వడం మానేసింది. దీంతో వినియోగదారులు విడిగా రూ. 2,000 వరకు ఖర్చు పెట్టి చార్జర్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ‘ఎవ్రీథింగ్ యాపిల్’ సేల్‌లో ఐఫోన్ 17 కొనుగోలు చేసే వారికి రూ.2,190 విలువైన అడాప్టర్‌ను క్రోమా ఉచితంగా అందించి కస్టమర్లకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది.
Also Read: సుర్రుమనే ఎండలకు.. షావోమీ ‘కూల్’ పంచ్.. జస్ట్ 15 సెకన్లలో చిల్లుమనే చల్లదనం!
ఈ ‘ఎవ్రీథింగ్ యాపిల్’ సేల్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని క్రోమా ప్రకటించింది. ఐఫోన్ 17తో పాటు యాపిల్ వాచ్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ ఆఫర్లను అందుకోవడానికి కస్టమర్లు సమీపంలోని క్రోమా స్టోర్‌ను సందర్శించవచ్చని సూచించింది. లేదంటే అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రొడక్ట్స్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
Also Read: ఏసీని ఎలా పడితే అలా ఆఫ్ చేస్తున్నారా? అయితే షెడ్డుకు వెళ్లడం ఖాయం!