E-Paper
Advertisement

Cooking Gas Saving Tips: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

Cooking Gas Saving Tips: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!
Advertisement

Cooking Gas Saving Tips: ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే.. దాని సెగ మాత్రం మన వంటింటి దాకా వచ్చేసింది. గ్యాస్ ధరలు చూస్తేనేమో చుక్కలు చూపిస్తున్నాయి. పోనీ భారమైనా సరే కొందామంటే సకాలంలో సిలిండర్ ఇంటికి రాదు. బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ ఎప్పుడు వస్తుందో తెలియక గృహిణులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి.

నిజానికి మనం వంట కోసం పూర్తిగా గ్యాస్ సిలిండర్‌పైనే ఆధారపడటం వల్ల, అది మధ్యలో అయిపోతే ఆ పూట వంట పూర్తవ్వక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రోజూ హోటల్ తిండి తినలేక, ఖాళీ సిలిండర్ చూసి కంగారు పడలేక సతమతమయ్యే కంటే.. మన అలవాట్లను కొంచెం మార్చుకుంటే చాలు. గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తూనే, వంట పనిని సులభం చేసే 5 బెస్ట్ ఐడియాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కరెంట్‌తో నడిచే ఇండక్షన్ స్టవ్‌లు..

Advertisement

ఇప్పుడు చాలా ఇళ్లలో గ్యాస్ స్టవ్‌కు ఉన్నా కూడా ఆల్టర్నేటివ్‌గా ఇండక్షన్ స్టవ్ కూడా ఉంటోంది. ఇది పూర్తిగా కరెంటుతో నడుస్తుంది కాబట్టి.. గ్యాస్ అయిపోతుందనే భయం ఉండదు. గ్యాస్‌తో పోలిస్తే దీనిలో వంట చాలా స్పీడ్‌గా పూర్తవుతుంది. అలాగే వంట అయిపోయాక ఆటోమేటిక్‌గా ఆగిపోయే ఫీచర్ కూడా ఉండటం వల్ల అదే పనిగా వంటను గమనించుకుంటూ ఉండాల్సిన పనిలేదు. సిలిండర్ లేని టైంలో ఇండక్షన్‌ స్టవ్ చాలా ఉపయోగకరం అనే చెప్పాలి.

Also Read: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!

మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కుక్కర్లు..

Advertisement

వంట పనిని నిమిషాల్లో పూర్తి చేసే పరికరం ఏదైనా ఉందంటే.. అది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కరే. దీనిలో కేవలం అన్నం మాత్రమే కాదు.. పప్పు, కూరలు, చివరకు బిర్యానీ కూడా నిమిషాల్లో చేసేయొచ్చు. దీనివల్ల గ్యాస్ వాడకం చాలా వరకు తగ్గుతుంది. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. గ్యాస్ దగ్గర ఉన్నట్టు పక్కనే నిలబడి చూసుకోవాల్సిన అవసరం లేదు. టైమర్ సెట్ చేస్తే వంట అయ్యాక అదే ఆగిపోతుంది. ఇది టైమ్ సేవ్ చేయడమే కాదు, గ్యాస్ బిల్లును కూడా తగ్గిస్తుంది.

సూర్యరశ్మితో సోలార్ కుక్కర్లు..

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ టైంలో సోలార్ కుక్కర్లను వాడటం చాలా స్మార్ట్ ఐడియా. దీనికి రూపాయి ఖర్చు ఉండదు.. కేవలం ఎండ ఉంటే చాలు. పప్పులు, కూరగాయలు ఇందులో నిదానంగా ఉడకడం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా అలాగే ఉంటాయి. ఇది వాతావరణంపై ఆధారపడి ఉన్నా, పర్యావరణానికి మేలు చేసే పద్ధతి. ఎండ ఉన్నప్పుడు దీన్ని వాడితే గ్యాస్ వాడకాన్ని సగానికి పైగా తగ్గించుకోవచ్చు.

కిచెన్ వేస్ట్‌తోనే వంట గ్యాస్..

ఇంట్లో మిగిలిపోయిన అన్నం, కూరగాయల తొక్కలు పారేయకుండా.. ఆ వ్యర్థాలతోనే సొంతంగా బయో గ్యాస్ తయారు చేసుకోవచ్చు. కొంచెం ఖాళీ స్థలం ఉన్న ఇళ్లలో చిన్న బయో గ్యాస్ యూనిట్ పెట్టుకుంటే, వంటకు కావాల్సిన గ్యాస్ మనమే సొంతంగా రెడీ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంటి చెత్త క్లీన్ అవుతుంది. గ్యాస్ కొరత అనే మాటే ఉండదు. సిలిండర్ డెలివరీ కోసం ఎదురుచూడాల్సిన పని అస్సలు ఉండదు.

ఎయిర్ ఫ్రైయర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు..

చిన్న చిన్న వంటల కోసం ప్రతిసారి గ్యాస్ స్టవ్ వెలిగించక్కర్లేదు. మైక్రోవేవ్ ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఆహారాన్ని వేడి చేసుకోవడం, గ్రిల్లింగ్ లేదా బేకింగ్ వంటి పనులు చిటికెలో అయిపోతాయి. ముఖ్యంగా ఎయిర్ ఫ్రైయర్లు తక్కువ నూనెతో హెల్తీ ఫుడ్ అందించడానికి భలే హెల్ప్ అవుతాయి. ఇలాంటి స్మార్ట్ పరికరాలను వాడటం వల్ల గ్యాస్ వాడకం తగ్గి, సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది.

Also Read: ఒక్కసారిగా పడిపోయిన ప్రీమియం ఫ్రిడ్జ్‌ల ధరలు.. ఏకంగా రూ.43,000కి పైగా డిస్కౌంట్!

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×