E-Paper
Advertisement

ఈ ఐదు ఫేమస్ యాప్స్ గూగుల్ సంస్థవే.. ఈ విషయం తెలుసా?

ఈ ఐదు ఫేమస్ యాప్స్ గూగుల్ సంస్థవే.. ఈ విషయం తెలుసా?
Advertisement

Google Famous Apps : టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఎన్నో యాప్ లను రూపొందించింది. సెర్చ్ ఇంజిన్ నుంచి క్లౌడ్ సేవలు, యాడ్స్, స్మార్ట్‌ఫోన్‌ ఇలా అనేక రంగాల్లో గూగుల్ ఒక బ్రాండ్‌. జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ జెమిని ఇలాంటి గూగుల్ సర్వీసులకు పరిచయం అక్కర్లేదు. కానీ మీరు చాలా కాలంగా ఉపయోగిస్తున్న కొన్ని యాప్ లు గూగుల్ సంస్థ రూపొందించినవే తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి ప్రముఖ యాప్ లు గురించి తెలుసుకుందాం.

స్నాప్ సీడ్ యాప్

గూగుల్ యాప్ లు మన రోజువారీ జీవితంలో సహాయపడుతున్నాయి. యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఇలాంటి యాప్ లతో పాటు మరికొన్ని ప్రముఖ యాప్ లను గూగుల్ రూపొందించింది. వీటిల్లో స్నాప్‌సీడ్ ఒకటి. 2012లో గూగుల్ ఈ యాప్‌ను కొనుగోలు చేసి ఆండ్రాయిడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. స్నాప్‌సీడ్‌ ఫొటో ఎడిటర్ యాప్. ఫొటో ఎడిట్ కు ఇందులో 25కు పైగా టూల్స్, ఫిల్టర్స్ ఉంటాయి. ఫొటోను ఆటోమేటిక్‌గా ట్యూన్ చేయడం, క్రాపింగ్, రొటేట్, బ్లర్ లేదా ఫిల్టర్‌ యాడింగ్ ఇందులో చాలా సులభం.

ఫొటోమ్యాథ్ యాప్

Advertisement

ఫొటోమ్యాథ్.. స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పరిష్కరించే మొబైల్ యాప్. మీరు స్కాన్ చేసిన సమస్యకు సమాధానం ఇవ్వడంతో పాటు వివరణను అందిస్తుంది. 2022లో గూగుల్ ఈ యాప్‌ను కొనుగోలు చేసింది. ఫోటోమ్యాథ్‌లో గూగుల్ AI, ఎడ్యుకేషన్ విషయాలను యాడ్ చేసింది. ఒక కాగితంపై గణిత సమస్య రాసి ఫొటో మ్యాథ్ యాప్ కెమెరాను చూపించడం ద్వారా, దాని పరిష్కారాన్ని ఇట్టే కనుక్కోవచ్చు.

లుక్ అవుట్ యాప్

గూగుల్ లుక్అవుట్ ఇంట్రెస్టింగ్ యాక్సెసిబిలిటీ యాప్. ముఖ్యంగా అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారి కోసం ఈ యాప్ ను రూపొందించారు. పరిసరాలను గురించి తెలుసుకునేందుకు ఫోన్ కెమెరా, AI ఫీచర్స్ ఉపయోగపడతాయి. దీంట్లోని టెక్స్ట్ మోడ్ ప్రింట్ చేసిన లేదా చేతితో రాసిన విషయాలను గట్టిగా చదువుతుంది. ఎక్స్‌ప్లోర్ మోడ్ చుట్టూ ఉన్న వస్తువులు, పరిసరాల గురించి తెలియజేస్తుంది. కిరాణా సామాను కొనుగోలుకు ఫుడ్ లేబుల్స్ మోడ్‌, కరెన్సీ నోట్లను గుర్తించడానికి కరెన్సీ మోడ్‌ను ఉపయోగపడుతుంది.

వేజ్ యాప్

Advertisement

మీరు గూగుల్ మ్యాప్స్, ఆపిల్ మ్యాప్స్‌ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే..వేజ్‌ బెటర్ ఆప్షన్. 2013లో గూగుల్ ఈ యాప్ ను కొనుగోలు చేసింది. వేజ్ యాప్ రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ యాప్‌ లో మీరు ట్రాఫిక్ జామ్ ఉందా లేదా వర్షం పడుతోందా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే విషయాలను రిపోర్ట్ చేయవచ్చు. తోటి డ్రైవర్ల కోసం ప్లాట్‌ఫామ్ సమాచారాన్ని ధ్రువీకరించవచ్చు. వేజ్ యాప్.. స్పీడ్ లిమిట్, పోలీసుల సమాచారం, లేన్ సిస్టమ్, ట్రాఫిక్ జామ్, టోల్ గేట్స్, పెట్రోల్ బంకుల, EV స్టేషన్లను చూపిస్తుంది. అలాగే పార్కింగ్ ఫీజ్ వేరియేషన్లను తెలుసుకోవచ్చు.

Also Read: జర జాగ్రత్త భయ్యా.. హార్ట్ సింబల్స్ వెనుక హార్ట్ ఎటాక్.. అసలు ట్విస్ట్ తెలిస్తే?

ఫిట్‌బిట్ యాప్

వేరబుల్స్ దిగ్గజం ఫిట్‌బిట్‌ను గూగుల్ 2021లో కొనుగోలు చేసింది. ఫిట్‌బిట్ హెల్త్ ను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్‌. గూగుల్ దీనిని ఎక్కువ బ్యాటరీ లైఫ్, సులభమైన ఇంటర్‌ఫేస్‌లతో యూజర్ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసేలా అభివృద్ధి చేసింది. ఫిట్‌బిట్ యాప్ స్లీపింగ్ స్టేజ్, హార్ట్ బీట్, ఒత్తిడిని ట్రాక్ చేస్తుంది. గూగుల్ హెల్త్ కనెక్ట్, పిక్సెల్ హార్డ్‌వేర్‌తో ఫిట్ బిట్ ను అనుసంధించడంతో స్పష్టమైన ఆరోగ్య విశ్లేషణలను అందిస్తుంది. ఫిట్‌బిట్ యాప్ ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Tags

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×