E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటో సంచలనం..నీటిలో పడ్డా,ఎత్తు నుంచి పడినా చెక్కుచెదరని మోటో G87

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటో సంచలనం..నీటిలో పడ్డా,ఎత్తు నుంచి పడినా చెక్కుచెదరని మోటో G87
Advertisement

Moto G87: మోటోరోలా తన పాపులర్ ‘G’ సిరీస్‌లో సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. తాజాగా విడుదలైన Moto G87 స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా, కళ్లు చెదిరే 5000 నిట్స్ బ్రైట్‌నెస్ గల డిస్‌ప్లేతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. పవర్ ఫుల్ ప్రాసెసర్, మన్నికైన బాడీ, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరతో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో G87 ఫీచర్లు:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటో తన దైన ముద్ర వేస్తోంది. తాజాగా విడుదలైన Moto G87 చూస్తుంటే.. బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో ఇతర కంపెనీలకు గట్టి పోటీ తప్పదనిపిస్తుంది. అద్భుత మైన కెమెరా సిస్టమ్, అత్యంత ప్రకాశ వంతమైన డిస్‌ప్లే ఈ ఫోన్  ప్రధాన ఆకర్షణలు.

Advertisement

200MP కెమెరా – ఫొటోగ్రఫీలో సరికొత్త బెంచ్‌మార్క్:
ఈ ఫోన్ వెనక భాగంలో 200MP మెయిన్ సెన్సార్‌ను అమర్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ‘అల్ట్రా పిక్సెల్’ టెక్నాలజీ తోడైంది. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయని, గతంతో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ లైట్ సెన్సిటివిటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 2x లాస్‌లెస్ జూమ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉన్నాయి. గూగుల్ ఫొటోస్ కి చెందిన మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్ వంటి AI టూల్స్ ఇందులో బిల్ట్-ఇన్ గా వస్తున్నాయి.

అద్భుతమైన డిస్‌ప్లే:
మోటో G87 లో 6.78-అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. దీని రిజల్యూషన్ 1272 x 2772 పిక్సెల్స్. ఇందులో హైలైట్ ఏటంటే 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. అంటే మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ , స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటాయి. స్క్రీన్  కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని వాడారు.

Advertisement

పెర్ఫార్మెన్స్ , బ్యాటరీ:
ఇందులో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 4GB ,8GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ‘ర్యామ్ బూస్ట్’ ఫీచర్ ద్వారా వర్చువల్ గా ర్యామ్‌ను 24GB వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే..28GB/256GB ఆప్షన్లు ఉన్నాయి.వీటిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే..5200mAh సామర్థ్యం గల బ్యాటరీకి 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక సారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

Also Read: ఏసీ కొనేముందు ఈ పొరపాటు చేయకండి! మీ కరెంట్ బిల్లును సగం చేసే స్మార్ట్ టిప్స్

ఇతర ఫీచర్లు:
ఈ ఫోన్ చాలా గట్టిది. దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే.. నీరు, దుమ్ము నుంచి దీనికి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ పొందింది. అంటే.. 1.2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా తట్టుకోగలదు. డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5G సపోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ధర:
Moto G87 ప్రారంభ ధర 399 యూరోలు (సుమారు రూ. 39,000). ఇది మొదట ఐరోపా, లాటిన్ అమెరికా మార్కెట్లలో విడుదలవుతోంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×