E-Paper
Advertisement

Motorola Edge 60 Pro: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు మావా.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్!

Motorola Edge 60 Pro: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు మావా.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్!
Advertisement

Motorola Edge 60 Pro: అధునాత ఫీచర్లు, బడ్జెట్ ధరలోనే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవాళ్లకి.. అమెజాన్ మంచి డీల్ తీసుకొచ్చింది. ఈ ఏడాది విడుదలైన Motorola Edge 60 Proపై ఏకంగా రూ.5 వేల తగ్గింపును ప్రకటించింది. అద్భుతమైన డిస్‌ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్ సూపర్-ఫాస్ట్ 125W ఛార్జింగ్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్ వివరాలేంటో చూద్దాం..

క్రేజీ డీల్.. సమయం లేదు:

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం వ్యూ ఎక్స్‌పీరియన్స్, స్పీడ్, బ్యాటరీ టాప్-అప్‌‌తో పొందవచ్చు. పైగా ఇది అత్యంత సరసమైన ధరకే లభిస్తుంది. భారత్ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ రూ.33,999 ధరకు విడుదలైంది. ప్రస్తుతం దీనిని అమెజాన్‌ డీల్‌లో రూ.28,990 ధరకే  కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.5009 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే EMI లావాదేవీల కోసం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వాడినట్లయితే.. అదనంగా రూ.1,750 తగ్గింపు పొందొచ్చు. మరింత తక్కువ ధరకు కొనాలనుకుంటే.. మీ పాత ఫోన్‌పై గరిష్టంగా రూ.27,400 ఎక్స్ఛేంజ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు ఇలా..

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల కర్వడ్ స్క్రీన్, స్ట్రాంగ్ రిజల్యూషన్, 120Hz మోషన్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ గ్లాస్ ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. ఇది 8జీబీ లేదా 12జీబీ మెమరీ, 256జీబీ స్టోరేజీతో స్పీడ్ మీడియాటెక్ చిప్‌లో రన్ అవుతుంది. 6000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న ఈ హ్యాండ్ సెట్ వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, చిన్న గాడ్జెట్‌లకు రివర్స్ ఛార్జింగ్స పోర్టు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.

పిక్చర్ క్వాలిటీ అదుర్స్..

ఈ  హ్యాండ్ సెట్ మూడు బ్యాక్ కెమెరాలతో వస్తుంది. దీనిలో రోజువారీ షాట్ల కోసం 50MP మెయిన్ కెమెరా, 50MP వెడల్పు, క్లోజప్ కెమెరాతో 10MP జూమ్ కెమెరా ఉంటాయి. 50MP ఫ్రంట్ కెమెరా హై క్వాలిటీ వీడియోకు సపోర్టును అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ క్లియర్ స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు, 5G, స్పీడ్ వైఫై, బ్లూటూత్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×