E-Paper
Advertisement

Moto S50 Neo: 4 ఏళ్ల వారంటీతో మోటోరోలా నుంచి మ్యాజిక్ ఫోన్.. ఈ సారి మామూలుగా ఉండదు మరీ

Moto S50 Neo: 4 ఏళ్ల వారంటీతో మోటోరోలా నుంచి మ్యాజిక్ ఫోన్.. ఈ సారి మామూలుగా ఉండదు మరీ
Advertisement

Moto S50 Neo with 4 Years Warranty: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మరొక కొత్త ఫోన్‌ను విడుల చేసేందుకు సిద్ధమైంది. Motorola కొత్త స్మార్ట్‌ఫోన్ Moto S50 Neo జూన్ 25న చైనాలో విడుదల కానుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇదే దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

4 సంవత్సరాల వారంటీతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది 3 సంవత్సరాల కాంప్లిమెంటరీ ఎక్పెండెడ్ వారంటీతో పాటు 1 సంవత్సరం ప్రామాణిక వారంటీని కలిగి ఉంటుంది. అయితే ఇంతకుముందు చాలా స్మార్ట్‌ఫోన్‌లకు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వారంటీ ఉండేది. అయితే ఇప్పుడు 4 సంవత్సరాల వారంటీతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అని చెప్పాలి.

Advertisement

Motorola S50 Neoపై వినియోగదారులు 4 సంవత్సరాల వారంటీని ఎలా పొందగలుగుతారు అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇది Moto G85 5G పేరుతో ప్రపంచ మార్కెట్‌లో విడుదల కానుంది. కానీ Moto G85 5Gతో 4 సంవత్సరాల వారంటీ ఉండే అవకాశం లేదు. Moto S50 Neo స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.6 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

Also Read: చెక్కతో చేసిన ఫోన్.. భారీ డిస్కౌంట్‌తో ఫస్ట్ సేల్.. చేతికి చిక్కితే ఉంటది!

Advertisement

ఇది FullHD ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అయితే ఫోన్ ప్రాసెసర్ గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది మిడ్‌రేంజ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది.

దీని బాడీ చాలా స్లిమ్ బిల్డ్‌లో రావచ్చు. కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే.. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో ఫోన్ రానుంది. ఇది బ్లాక్, గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×