Motorola Edge 50 Ultra First Sale with Rs 5,000 Discount: టెక్ మేకర్ మోటరోలా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా Edge 50 అల్ట్రాను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మోటో AI, స్మార్ట్ కనెక్ట్ వంటి సరికొత్త ఫీచర్లను చూడొచ్చు. IP68 రేటింగ్ ఉన్న ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, Qualcomm ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఇది Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 50 MP మెయిన్ కెమెరా, 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
Motorola Edge 50 Ultra Price and Offers
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ.59,999గా ఉంది. అయితే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీరు రూ. 5,000 తక్షణ తగ్గింపును పొందుతారు. అప్పుడు మీరు రూ. 54,999కి ఫోన్ దక్కించుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ మొదటి సేల్ ప్రారంభమవుతుంది. కొత్త ఫోన్‌ను పీచ్ ఫడ్జ్, నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
Experience the fragrance of nature with World's 1st FSC-certified wood in #MotorolaEdge50Ultra. Experience flagship features with motoAI & Smart Connect.
Starting at ₹49,999*, sale starts 24 Jun @flipkart, https://t.co/azcEfy2uaW & leading retail stores#EffortlesslyIntelligent pic.twitter.com/PMXp3rbp0C
— Motorola India (@motorolaindia) June 18, 2024
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో 6.7-అంగుళాల పోలెడ్ డిస్‌ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో Qualcomm స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ Android 14 ఆధారిత సాఫ్ట్‌వేర్ స్కిన్‌తో వస్తుంది. ఇందులో AI ఫీచర్లు ఉంటాయి.
Also Read: ఆహా ఏముంది.. ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అరాచకం మావ!
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఎడ్జ్ 50 అల్ట్రా వెనుక ప్యానెల్ 50MP ప్రైమరీ లెన్స్‌తో పాటు 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా 100x AI జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 4500mAh బ్యాటరీకి 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉంటుంది.