E-Paper
Advertisement

NASA Aircraft: నాసా రీసెర్చ్‌ విమానం.. ల్యాండింగ్‌ గేర్‌ లేకుండానే, వెనుక నుంచి భారీగా మంటలు

NASA Aircraft: నాసా రీసెర్చ్‌ విమానం.. ల్యాండింగ్‌ గేర్‌ లేకుండానే, వెనుక నుంచి భారీగా మంటలు
Advertisement

NASA Aircraft: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి చెందిన ఓ రీసెర్చ్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అత్యవసరంగా భూమిపై దిగింది. ఆ సమయంలో విమానం వెనుక నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించారు. అప్పటికే అక్కడున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అసలు ఏమైంది?

గాల్లో ఉండగా నాసా రీసెర్చ్‌ విమానం సమస్య

Advertisement

అమెరికాలోని నాసాకు చెందిన రీసెర్చ్‌ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఆ సమస్య ల్యాండ్‌ గేర్‌లో వచ్చింది. పరిస్థితి గమనించిన పైలట్, సమీపంలోని ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హ్యూస్టన్‌లోని ఎల్లింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు.

ఆ సమయంలో విమానం అదుపుతప్పి రన్‌వేపై ఓ వైపుకు వంగిపోయింది. దీంతో విమానం వెనుక నుంచి తొలుత పొగలు, ఆ తర్వాత భారీగా మంటలు వచ్చాయి. అప్పటికే అక్కడున్న ఎయిర్‌పోర్టులోని రెస్క్యూ సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సహాయంతో కాక్‌పిట్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు పైలట్.

Advertisement

ల్యాండింగ్‌ గేర్‌ లేకుండానే భూమిపైకి, ఎగిసిపడిన మంటలు

ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనను నాసా ధ్రువీకరించింది. ఈ ఘటనలో సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం నాసా (WB-57)కు చెందినది. పరిశోధన కోసం వినియోగించే విమానం, ఇద్దరు సిబ్బందితో అధిక ఎత్తులో ఎగరగలదు.

ఎక్కువ ఎత్తులో ఎగరడానికి దీన్ని రూపొందించింది. కేవలం అరడజను గంటలపాటు గాలిలో ఎగరగలదు. ఫుటేజ్‌లో విమానం కాక్‌పిట్ హాచ్ తెరిచి ఉండగా రన్‌వేపై ఆగిపోయినట్లు కనిపించింది. WB-57 విమానాన్ని 1970ల నుండి నాసా పరిశోధన కార్యకలాపాల కోసం ఉపయోగిస్తోంది. ఎల్లింగ్టన్ ఫీల్డ్ సమీపంలోని NASA జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఉంటుంది.

ALSO READ: ఫిబ్రవరిలో స్మార్ట్‌ఫోన్ల జాతర.. శాంసంగ్ నుంచి మోటో వరకు  టాప్-5 మొబైల్స్!

ఆ తరహా మూడు విమానాలను నడుపుతోంది. WB-57 అనేది మిడ్-వింగ్ కాగా, లాంగ్-రేంజ్ రీసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్ మరొకటి. ఇంకొకటి 63 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగరగలదు. వాతావరణ పరిశోధన మిషన్ల కోసం ఉపయోగించబడుతుంది. దాదాపు ఈ విమానం ఆరున్నర గంటలపాటు ప్రయాణించగలదు. 2,500 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణిస్తుంది. 8,800 పౌండ్ల పేలోడ్ వరకు మోసుకెళ్తుంది. దాదాపు 410 నాట్ల వాయు వేగంతో నడుస్తోంది.

 

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×