Upcoming Smartphones Feb 2026: సాధారణంగా ఫిబ్రవరి నెల వస్తోందంటే చాలు.. టెక్ ప్రియుల్లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఎందుకంటే.. కొత్త ఏడాదిలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు తమ సరికొత్త మోడళ్లతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతుంటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో లాంచ్ కానున్న టాప్-5 స్మార్ట్‌ఫోన్ల వివరాలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా గేమింగ్ ప్రియుల కోసం ఐకూ సంస్థ iQOO 15R మోడల్‌ను తీసుకురానుంది. ఫిబ్రవరి 24 విడుదలయ్యే ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. 144Hz అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు 7600mAh భారీ బ్యాటరీ దీనిలో ఉండనుంది. దీంతో ఛార్జింగ్ టెన్షన్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక ఫొటోగ్రఫీ కోసం 200MP మెయిన్ సెన్సార్‌ను కూడా జోడించనున్నట్లు సమాచారం.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 రోజులు వాడొచ్చు.. అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో లాంచ్!
కెమెరా లవర్స్ కోసం ప్రముఖ వివో సంస్థ Vivo V70 సిరీస్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే ఈ ఫోన్.. Zeiss సంస్థతో జతకూడి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకోనుంది. దీనిలో 6500mAh బ్యాటరీ, Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ యూజర్లను కచ్చితంగా కట్టిపడేస్తుందనే టాక్ నడుస్తోంది.
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి Moto Edge 70 Fusion సరైన ఎంపిక కానుంది. ఫిబ్రవరి మధ్యలో రానున్న ఈ ఫోన్‌లో సోనీ కెమెరా సెటప్, 7000mAh బ్యాటరీ, 144Hz క్వాడ్‌కోర్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ దీనికి అదనపు బలం కానుంది.
ఇక శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కూడా ఫిబ్రవరి మూడో వారంలో మార్కెట్‌లో సందడి చేయనుంది. దీనిలో Samsung Galaxy S26+ మోడల్ ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో రానుండగా.. మిగిలిన ఫీచర్లు పాత వెర్షన్ మాదిరిగానే ఉండవచ్చని సమాచారం.
ఫిబ్రవరి 25 విడుదల కానున్న Samsung Galaxy S26 Ultra ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 6.9 ఇంచుల భారీ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. ఇక వెనుక వైపు నాలుగు ఫ్లాగ్‌షిప్ కెమెరాలతో ఫొటోగ్రఫీలో సరికొత్త అనుభూతిని అందించనుందని టెక్ నిపుణుల అంచనా.
Also Read: గేమర్స్ కోసం HP కొత్త అస్త్రం.. AI ఫీచర్లతో ‘ఒమెన్ 15’ విడుదల!