E-Paper
Advertisement

Beem 560 android Projector: మూవీ లవర్స్‌కు పండగే పండగ.. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫైడ్ పోర్ట్రానిక్స్ బీమ్ 560 ప్రొజెక్టర్ లాంచ్!

Beem 560 android Projector: మూవీ లవర్స్‌కు పండగే పండగ.. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫైడ్ పోర్ట్రానిక్స్ బీమ్ 560 ప్రొజెక్టర్ లాంచ్!
Advertisement

Beem 560 android Projector: ఇంట్లోనే బిగ్ స్క్రీన్ మీద థియేటర్ అనుభూతిలో సినిమా చూడాలనుకునే మూవీ లవర్స్‌కు పండగ లాంటి వార్త. కొంతకాలంగా డిజిటల్ యాక్సెసరీస్ మార్కెట్లో ఫేమస్ అయిన Porttronics కంపెనీ కొత్తగా ‘Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్’ను భారత మార్కెట్‌లోకి దించింది. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్.. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే ఫీచర్లను కలగి ఉండటంతో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. ఈ సరికొత్త పోర్ట్రానిక్స్ బీమ్ 560లో 5300 లూమెన్స్ LED లైట్ సోర్స్‌ను కూడా అందించారు.

100 ఇంచుల స్క్రీన్ ప్రొజెక్షన్:

బీమ్ 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ఫుల్ HD 1080p రిజల్యూషన్‌‌కు మద్ధతు ఇస్తుంది. 100 ఇంచుల వరకు భారీ స్క్రీన్ ప్రొజెక్షన్ ఇవ్వగల సామర్థ్యం ఈ ప్రొజెక్టర్‌ కలిగి ఉంటుంది. అలాగే స్పష్టమైన విజువల్స్ కోసం ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లను సైతం దీనిలో ఉంది. ఈ ప్రొజెక్టర్లను టేబుల్, షెల్ఫ్ లేదా బెడ్‌సైడ్ వంటి ప్రదేశాల్లో సులభంగా సెట్ చేసుకోవడానికి అడ్జస్టబుల్ టిల్ట్ యాంగిల్ డిజైన్‌ను అందించారు.

అదనంగా స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్:

Advertisement

Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ ఇన్‌బిల్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. తద్వారా నేరుగా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఈ ప్రొజెక్టర్‌ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా.. మొబైల్స్, టాబ్స్, ల్యాపీల నుంచి వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్‌కు కూడా ఈ ప్రొజెక్టర్ సపోర్ట్ ఇస్తుంది.

థియేటర్ అనుభవం:

ఇక కనెక్టివిటీ పరంగా చూసుకుంటే.. దీనిలో డ్యుయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI, AUX పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం ఇన్‌బిల్ట్ 3W స్పీకర్‌ను కలిగి ఉంది. మీరు మరింత సౌండ్ కావాలంటే.. బ్లూటూత్ ద్వారా ఎక్స్‌టర్నల్ స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. వైట్ కలర్లో వచ్చిన కాంపాక్ట్ డిజైన్ వల్ల బెడ్‌రూమ్, లివింగ్ రూమ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది.

ధర ఎంతంటే?

Advertisement

ఈ కొత్త ప్రొజెక్టర్ ధర రూ.14,499గా నిర్ణయించారు. దీనిని Porttronics అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్లలో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రొజెక్టర్‌కు ఓ ఏడాదిపాటు వారంటీను కూడా కంపెనీ అందిస్తోంది హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్ ఫీచర్లతో కూడిన ప్రొజెక్టర్‌ కోసం చూస్తున్నవాళ్లకి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

 

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×