E-Paper
Advertisement

Jana Nayagan Hindi Version: విజయ్ సినిమా జనా నాయకన్‌కు హిందీలో ఎదురుదెబ్బ.. మార్పులు తప్పవా..!

Jana Nayagan Hindi Version: విజయ్ సినిమా జనా నాయకన్‌కు హిందీలో ఎదురుదెబ్బ.. మార్పులు తప్పవా..!
Advertisement

Jana Nayagan Hindi Version: ఇటీవల విడుదలైన జనా నాయకన్ సినిమా హిందీ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్రైలర్ నచ్చి పాజిటివ్ విషయం వల్ల వైరల్ అవుతుంది అనుకుంటే మాత్రం.. మీరు పప్పులో కాలేసినట్టే. కొన్ని నెగిటివ్ కారణాలవల్ల ఈ సినిమా హిందీ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. తెగ నెగటివ్ కామెంట్స్ ఐటమ్ తెచ్చి పెట్టుకుంటుంది.

విజయ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే.. అన్ని భాషల ప్రేక్షకుల.. నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో.. వాడిన డబ్బింగ్ వాయిస్‌పై ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ..హిందీ డబ్బింగ్ వాయిస్ మాత్రం హీరోకు సరిపోవడం లేదని అభిమానులు అంటున్నారు. ఈ ట్రైలర్ లో విజయ్ వాయిస్ అసలు బాగాలేదని కామెంట్లు పెడుతున్నారు. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఆ వాయిస్ మ్యాచ్ కావడం లేదని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిందీ మార్కెట్‌లో సినిమా భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి.

ఇంతకుముందు విజయ్ సినిమాలకు హిందీలో డబ్బింగ్ ఇచ్చిన సంకేత్ మ్హాత్రే వాయిస్‌ను మళ్లీ తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అతని వాయిస్‌కు ఉత్తర భారత ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు ఉందని..విజయ్ పాత్రలకు బాగా సెట్ అవుతుందని వారు కామెంట్స్ పెడుతున్నారు. అతని వాయిస్ కాకుండా..ఇపుడు ట్రైలర్ లో ఉండే వాయిస్ ..కొనసాగిస్తే సినిమా హిందీ మార్కెట్‌లో మరింత నష్టపోయే అవకాశం ఉందని కూడా కొందరు చెబుతున్నారు.

Advertisement

ఉత్తర భారత మల్టీప్లెక్సుల్లో జనా నాయకన్ సినిమాను విడుదల చేయాలని.. మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీ బెల్ట్‌లో ప్రీ-బుకింగ్స్ అంతగా లేవు. దీనికి ప్రధాన కారణం డబ్బింగ్ సమస్యేనని.. ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డబ్బింగ్ వాయిస్ మార్చకపోతే థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గే ప్రమాదం ఉందని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటారా..లేదా అదే వాయిస్‌తో ముందుకు వెళ్తారా.. అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల కు..కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఎలాంటి నిర్ణయం అయిన త్వరగా తీసుకోవాలి..కాబటి రాబోయే రోజుల్లో ఈ విషయంపై తీసుకునే డెసిషన్.. సినిమాకు చాలా ముఖ్యమయ్యే అవకాశంలా కనిపిస్తుంది.

మరోపక్క ఈ సినిమాకు తెలుగు లో కూడా పెద్ద ఓపెనింగ్స్ కనిపివడం లేదు. ఈ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అని అందరూ భావిస్తూ ఉండడంతో..తెలుగులో ఈ సినిమా పై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ALSO READ: Peddi Movie: పెద్ది వాయిదా రూమర్లకు చెక్…ఒక్క పోస్టర్ తో క్లారిటీ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×