E-Paper
Advertisement

New AI Model:- వేసవికాలంలో వర్షాలు.. గుర్తించే ఏఐ మోడల్..

New AI Model:- వేసవికాలంలో వర్షాలు.. గుర్తించే ఏఐ మోడల్..

New AI Model:- ఒకప్పుడు వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. ఇలా ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క ఋతువు ఉండేది. కానీ మెల్లగా మార్పులు మొదలయ్యాయి. మనుషుల వల్ల పెరుగుతున్న కాలుష్యం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. వేసవి అయితే విపరీతమైన ఎండ, శీతాకాలం అయితే తట్టుకోలేనంత చలి.. అంతే కాకుండా అప్పుడప్పుడు వేసవిలో కురిసే వర్షాలు. ఏది ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేకపోతున్నాం. దానికోసమే శాస్త్రవేత్తలు ఏఐను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

ఏప్రిల్, మే నేలలు ఏసీ లేకుండా ఇంట్లో ఉండలేనంత ఎండలు ఉండేవి. కానీ గత కొన్నేళ్లుగా వర్షాకాలం కంటే ఎండాకాలంలోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల ఎన్నో విధాలుగా మనుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాతావరణ శాఖ కూడా ఈ మార్పులు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అంటోంది. అందుకే హఠాత్తుగా వచ్చే ఈ మార్పులను కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఏఐ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని వారు ప్రకటించారు.

ఇండియన్ సమ్మర్ మాన్సూన్స్ (ఐఎస్సెమ్మార్)ను కనిపెట్టడం కోసమే ప్రత్యేకంగా ఒక ఏఐ ఆల్గరిథం సిద్ధమవుతోంది. దీనికి ప్రెడిక్టర్ డిస్కవరీ ఆల్గరిథం (పీడీఏ) అని పేరు కూడా పెట్టారు. ఎకానమి విషయంలో, వ్యవసాయం విషయంలో ఈ హఠాత్తు వర్షాలు అనేవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా వీటికోసం ఈ ఏఐ ఆల్గరిథంను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. పంట చేతికి వచ్చే సమయానికి అనుకోకుండా వేసవికాలంలో వస్తున్న వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఈ ఏఐ ముందస్తు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడనుంది.

ప్రస్తుతం ఈ విభాగంలో ఏఐకు మరింత ట్రైనింగ్ అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్రైనింగ్‌ను బట్టి, ఏఐ చేసే స్టడీ బట్టి ఇది వేసవికాలంలో వచ్చే వర్షాలను అంచనా వేసి వాతావరణ శాఖకు సమాచారం అందిస్తుంది. వారు తయారు చేసిన ఏఐ మోడల్ కచ్చితంగా రైతులకు, వాతావరణ శాఖకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలులతో వేసవికాలంలో వస్తున్న వర్షాల గురించి ఏఐ ముందే సూచిస్తుందని తెలిపారు.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×