BigTV English

Jogi Ramesh: డీఎస్పీకి వార్నింగ్!.. రోజా సాక్షిగా ‘జోగి’ యాగి..

Jogi Ramesh: డీఎస్పీకి వార్నింగ్!.. రోజా సాక్షిగా ‘జోగి’ యాగి..

Jogi Ramesh(AP Political News): మంత్రి జోగి రమేశ్ తెలుసుగా. ఫుల్ కాంట్రవర్సీ లీడర్. పెద్ద నోరున్న నాయకుడు. టీడీపీపై ఘాటైన విమర్శలతో చెలరేగిపోతుంటారు. ఆయన నోరు చూసే.. జోగికి మంత్రి పదవి ఇచ్చారని కూడా అంటారు. ప్రతిపక్ష పార్టీపై దూకుడు బాగా అలవాటైన మంత్రి.. అదే మేనరిజంలో పోలీస్ అధికారులపైనా విరుచుకుపడటం వివాదాస్పదంగా మారింది. పైకి ఏమీ అనలేకపోతున్నా.. లోలోన బాగా రగిలిపోతున్నారట ఖాకీలు. ఇంతకీ అసలేం జరిగిందంటే…


మంత్రి జోగి రమేష్ పోలీస్ ఆఫీసర్ పై దురుసుగా ప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషాను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.

మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఇదే సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్ప గుచ్చం ఇచ్చేందుకు వచ్చారు.


ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ భాషా కోరారు. ఆ ప్రయత్నంలో ఉన్న డీఎస్పీపై జోగి రమేష్ దురుసుగా వ్యవహరించారు. నువ్వు ముందు పక్కకు వెళ్లు అంటూ డీఎస్పీపై మంత్రి ‌జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోరేసుకుని.. వేలు చూపిస్తూ.. హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. జోగి రమేష్ తీరుపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×