E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!
Advertisement

Noise Buds Connect 3: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫోన్ తర్వాత అంతటి ముఖ్యమైన గ్యాడ్జెట్ ఇయర్ బడ్స్ . ఆఫీస్ కాల్స్, మ్యూజిక్ ఎంజాయ్‌మెంట్ లేదా ట్రావెలింగ్‌లో రిలాక్స్ అవ్వడానికి మంచి బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఉండాల్సిందే. అయితే బడ్జెట్ ధరలో ..ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ సౌండ్, ఫాస్ట్ కనెక్టివిటీ ఇచ్చే ఇయర్ బడ్స్ కోసం చూస్తుంటే.. నోయిస్ తీసుకొచ్చిన Noise Buds Connect 3 పర్‌ఫెక్ట్ ఛాయిస్! రూ. 1,499 లభించే ఈ ట్రెండింగ్ ఇయర్ బడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలింగ్ క్లారిటీ కోసం Quad-Mic ENC:

బయటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు లేదా బస్సు, బైక్‌పై వెళ్తున్నప్పుడు లౌడ్‌గా కాల్స్ మాట్లాడటం పెద్ద సవాలు. దీనికి సొల్యూషన్‌గా నోయిస్ బడ్స్ కనెక్ట్ 3 లో Quad-Mic (మొత్తం 4 మైక్రోఫోన్లు) తో ఉన్న టెక్నాలజీని అందించారు. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ఫిల్టర్ చేసి, మీ వాయిస్‌ని అవతలి వ్యక్తికి చాలా క్లియర్‌గా వినబడేలా చేస్తుంది.

Advertisement

40 గంటల నాన్-స్టాప్ ప్లేటైమ్:
తరచూ ఛార్జింగ్ పెట్టే తలనొప్పి వద్దనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఇయర్ బడ్స్ సింగిల్ ఛార్జ్‌పై కేస్‌తో కలిపి ఏకంగా 40 గంటల ప్లేటైమ్‌ని ఇస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కొన్ని రోజుల పాటు మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

సెకన్లలో కనెక్ట్:
ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.4 వెర్షన్‌ను ఉపయోగించారు. దీనివల్ల లాగ్-ఫ్రీ ఆడియో,ఫాస్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. అంతేకాకుండా, నోయిస్ సొంత ‘HyperSync’ టెక్నాలజీ ద్వారా కేస్ తెరవగానే మీ స్మార్ట్‌ఫోన్‌కు క్షణాల్లోనే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది.

Advertisement

వాటర్ రెసిస్టెన్స్ & ఫిట్ డిజైన్:
జిమ్‌లో వర్కౌట్స్ చేసేటప్పుడు వచ్చే చెమట లేదా వర్షపు చినుకుల వల్ల ఇయర్ బడ్స్ పాడవుతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇవి IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తాయి. చెవిలో సౌకర్యవంతంగా సెట్ అయ్యేలాగా ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించబడ్డాయి.

Also Read: రియల్‌మీ నుంచి అదిరిపోయే టీవీ..ఆఫర్ పోతే మళ్లీ రాదు

ధర:
ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఇయర్ బడ్స్ ధర ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్స్‌లో ఆఫర్ కింద రూ. 1,499 కే అందుబాటులో ఉంది. రూ. 1,500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం స్టైలిష్ లుక్, క్వాడ్ మైక్ కాలింగ్ క్లారిటీ, 40 గంటల మెగా బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి నోయిస్ బడ్స్ కనెక్ట్ 3 ఒక వర్త్ బై ఆప్షన్! మీ డైలీ వైబ్‌ని మార్చేయడానికి ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను ఇప్పుడే ట్రై చేయండి.

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×