E-Paper
Advertisement

నోయిస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. ‘హాలో 3’ లోని ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

నోయిస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. ‘హాలో 3’ లోని ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Advertisement

NoiseFit Halo 3: స్మార్ట్‌వాచ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోయిస్ సంస్థ,యూజర్ల అభిరుచులకు అనుగుణంగా NoiseFit Halo 3ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గత వెర్షన్ల కంటే.. మెరుగైన డిస్‌ప్లే, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో పాటు.. ఇందులో ఏఐ ట్రాన్స్లేషన్, QR Vault వంటి వినూత్న ఫీచర్లను యాడ్ చేసింది. టెక్నాలజీతో పాటు స్టైల్‌ను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ వాచ్, ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇండియా నంబర్ వన్ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ నోయిస్, తన స్మార్ట్ వేరబుల్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. యూజర్ సెంట్రిక్ డిజైన్ ప్రకారం రూపొందించిన ఈ వాచ్‌లోని ప్రతి ఫీచర్ ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

నోయిస్ ఫిట్ హాలో 3 ఫీచర్ల పూర్తి వివరాలు:

డిస్‌ప్లే ,డిజైన్:
NoiseFit Halo 3 అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది హై-రిజల్యూషన్, మెరుగైన బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్ , విభిన్న రకాల స్ట్రాప్ ఆప్షన్లతో ఇది క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ఇందులో ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’సౌకర్యం కూడా ఉంది.

Advertisement

ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్ :
ఈ వాచ్‌లోని అతిపెద్ద హైలైట్ ఏఐ ట్రాన్స్లేషన్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు తమ వాయిస్ నోట్స్‌ను రికార్డ్ చేయడమే కాకుండా.. వాటిని ఆటోమేటిక్‌గా టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. మీటింగ్స్ లేదా ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఈ ఫీచర్‌ను నోయిస్ తన వాచ్‌లోకి తీసుకురావడం విశేషం.

QR వాల్ట్ ఫీచర్:
డిజిటల్ పేమెంట్స్, సోషల్ మీడియా కనెక్టివిటీ కాలంలో QR వాల్ట్ ఒక అద్భుతమైన ఫీచర్. యూజర్లు తమ ముఖ్యమైన QR కోడ్‌లను (పేమెంట్ కోడ్స్ లేదా వెబ్‌సైట్ లింక్స్) వాచ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండానే నేరుగా వాచ్ స్క్రీన్ ద్వారా స్కాన్ చేసే వీలుంటుంది.

హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం నోయిస్ ఇందులో హెల్త్ సూట్ ను అందించింది.

24/7 హార్ట్ రేట్ మానిటరింగ్: గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.

SpO2 ట్రాకింగ్: రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను లెక్కిస్తుంది.

నిద్ర : నిద్ర నాణ్యతను విశ్లేషిస్తుంది.

100+ స్పోర్ట్స్ మోడ్స్: రన్నింగ్, సైక్లింగ్ నుంచి యోగా వరకు ప్రతి యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది.

బ్యాటరీ,కనెక్టివిటీ:
బ్యాటరీ విషయంలో రాజీ పడకుండా.. సాధారణ వాడకంతో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఈ వాచ్ అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్నప్పటికీ.. పవర్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ ఉండటం వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ బాగుంటుంది.

తక్కువ ధరలో ఏఐ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ కోరుకునే వారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా QR వాల్ట్ , AI ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌ను తన పోటీదారుల కంటే ఒక అడుగు ముందు ఉంచుతున్నాయి.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×