E-Paper
Advertisement

కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం, బిగ్ టీవీతో ప్రత్యేకంగా కేంద్రమంత్రి పెమ్మసాని

కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం, బిగ్ టీవీతో ప్రత్యేకంగా కేంద్రమంత్రి పెమ్మసాని
Advertisement

Minister Pemmasani: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో కేంద్రమంత్రుల నుంచి మొదలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు తమ తమ కాన్వాయ్‌లోని వాహనాలను కుదించుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ఒక్క వాహనం చాలన్న ఆయన, మాకు పెద్ద ఇబ్బందులేవీ లేవన్నారు. కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దామంటూ పొదుపు మంత్రం అభివృద్ధికి సూత్రమన్నారు.

కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగినా దాని పరిణామాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని అన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రుల వరకు కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించుకోవడంపై తొలిసారి బిగ్ టీవీతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు వరకు దేశంలో ఉన్న నిల్వలు, మోదీ ప్రయత్నం వల్ల కొన్నాళ్లు ఇబ్బంది లేకుండా గడిపామన్నారు.

మున్ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యంత భద్రత కలిగిన ప్రధాని నరేంద్రమోదీ, తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకున్నారని గుర్తు చేశారు. మాలాంటి వారికి అలాంటి సెక్యూరిటీ రిస్క్ ఉండదన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మాకు అంత సెక్యూరిటీ అవసరం లేదని తేల్చేశారు.

Advertisement

బిగ్ టీవీతో ప్రత్యేకంగా కేంద్రమంత్రి పెమ్మసాని

ఈ విధంగా అందరూ చేయాలని కోరుకుంటున్నామని, ఎన్నిరకాలుగా పొదుపు చేస్తే అంత మంచిదన్నారు. ప్రధాని మోదీ చేసిన సూచనల నేపథ్యంలో మరో మాట చెప్పారు కేంద్రమంత్రి. ప్రధానికి ఉన్న విషయ పరిజ్ఞానం అందరికి ఉండకపోవచ్చని, అందువల్ల సూచనలు చేశారన్నారు.

రూపాయి పతనం, బంగారం, ఆయిల్ వంటివి కొనుగోలు చేయడం వల్ల మన దగ్గరున్న ఫారెన్ నిల్వలు తగ్గుతాయని వివరించారు. అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల ఈ విధంగా చేశారన్నారు. తప్పనిసరి అయితే కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయంలో పరిశ్రమల మీద ఆధారపడిన వారు వ్యాపారం ఆగిపోతే వారికి ఇబ్బంది అవుతుందన్న ఆయన, ఈ ఏడాది కాస్త వ్యాపారం తగ్గినా వచ్చే ఏడాది పెరుగుతుందన్నారు.

ALSO READ: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

వ్యాపారాలు చేసేవారు ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం విధానంపైనా మాట్లాడారు. తనకు కంపెనీలు ఉన్నాయని, తాము వర్క్ ఫ్రం హోం పెంచే ఆలోచనలో ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×