E-Paper
Advertisement

Normal Vs Premium Petrol: నార్మల్ పెట్రోల్ Vs ప్రీమియం పెట్రోల్… మీ వెహికల్ కు ఏది బెటర్?

Normal Vs Premium Petrol: నార్మల్ పెట్రోల్ Vs ప్రీమియం పెట్రోల్… మీ వెహికల్ కు ఏది బెటర్?
Advertisement

Normal Vs Premium Petrol: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.2.35 పెంచాయి. ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచుతున్నట్లు హెచ్‌పీసీఎల్ శుక్రవారం ప్రకటించింది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ ప్రీమియం పెట్రోల్‌ రేట్లను పెంచాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయి.

మూడు రకాల పెట్రోల్

ప్రస్తుతం మార్కెట్ లో మూడు రకాలుగా పెట్రోల్‌ అందుబాటులో ఉంది. నార్మల్ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్, హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్. మెరుగైన ఇంజిన్ పనితీరు, మైలేజ్ కోసం ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగిస్తారు. బీపీసీఎల్ స్పీడ్, హెచ్‌పీసీఎల్ పవర్, ఐఓసీఎల్ ఎక్స్‌పీ95 పేర్లతో ప్రీమియం పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి. పెట్రోల్ గ్రేడ్‌ను దాని ఆక్టేన్ వ్యాల్యూ ఆధారంగా వర్గీకరిస్తారు. భారత్‌లో నార్మల్ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా ఉంటుంది.

ప్రీమియం పెట్రోల్ అంటే

Advertisement

ప్రీమియం పెట్రోల్ అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం. దీని ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 95 నుంచి 99 మధ్య ఉంటుంది. హై కంప్రెషన్ ఉన్న ఇంజిన్లలో మెరుగైన పనితీరు కోసం, నాకింగ్‌ను తగ్గించడం కోసం తయారు చేస్తారు. ఇది ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా అధిక వేగంతో నడిపేటప్పుడు బాగా పనిచేస్తుంది. ఇండియన్ ఆయిల్ XP95 పెట్రోల్ 95 ఆక్టేన్ రేటింగ్‌తో ఉన్న ప్రీమియం పెట్రోల్. ఇది సాధారణ పెట్రోల్ కంటే మెరుగైన యాక్సిలరేషన్, స్వచ్ఛమైన ఉద్గారాలు, మంచి మైలేజీని అందిస్తుంది.

ఇంజిన్ పనితీరు

హై ఆక్టేన్ నెంబర్ కలిగిన పెట్రోల్ ఎక్కువ కంప్రెషన్ రేషియోను కలిగి ఉంటుంది. దీంతో ఇంజిన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవ్వదు. అంతేకాదు కార్బన్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. పవర్ ఫుల్ ఇంజిన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, బైక్​లు, సూపర్ కార్లకు ప్రీమియం పెట్రోల్ ఉత్తమంగా నిపుణులు చెబుతారు. నార్మల్ పెట్రోల్‌తో వెహికల్ పనితీరుపై, నిర్వహణ ఖర్చులపై ప్రభావం చూపుతుంది. ప్రామాణిక ఇంజిన్‌లకు సాధారణ పెట్రోల్ సరిపోతుంది. ప్రీమియం పెట్రోల్‌ను మెరుగైన ఇంజిన్ పనితీరు, సామర్థ్యం కోసం ప్రత్యేకంగా వాడతారు.

ప్రీమియం, సాధారణ పెట్రోల్ కలిపితే

Advertisement

సాధారణ పెట్రోల్ వెహికల్స్ లో ఎక్కువగా ఉపయోగించే ఇంధనం. దీని ఆక్టేన్ రేటింగ్ 91. చాలా వాహనాలకు అనుకూలంగా ఉంటుంది. రోజువారీ డ్రైవింగ్‌కు సౌలభ్యంగా ఉంటుంది. ప్రీమియం, సాధారణ పెట్రోల్‌ను కలపడం మంచిది కాదని ఎక్స్ ఫర్ట్ చెబుతున్నారు. ఎందుకంటే ఇంధన పనితీరులో వ్యత్యాసాలకు.. ఇంజిన్ పనితీరు ఎఫెక్ట్ అవుతుంది. మీ వాహనానికి సూట్ అయ్యే ఇంధన రకాన్ని ఉపయోగించడం ఉత్తమమని ఎక్స్ ఫర్ట్స్ చెప్తున్నారు.

Also Read:  వాహనదారులకు బిగ్ షాక్.. దేశంలో పెట్రోల్ ధరలు పెంపు, ఒక లీటర్‌పై ఎంతంటే?

సాధారణ పెట్రోల్ రేటు తక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ధర నార్మల్ కంటే లీటరుకు రూ.5 నుండి రూ.10 వరకు ఎక్కువగా ఉంటుంది. నార్మల్ పెట్రోల్ ను సాధారణ బైకులు, బడ్జెట్ కార్లలో వాడుతుంటారు. ప్రీమియం పెట్రోల్ ను హై ఎండ్ కార్లు, స్పోర్ట్స్ బైకులు ఉపయోగిస్తారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×