Philips OLED760 TV: ఫిలిప్స్ (Philips) కంపెనీ నుంచి వచ్చిన OLED760 మోడల్ టీవీ.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో అధిక బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చిన ‘LG B5’, ‘Samsung S85F’ ఒలెడ్ టీవీలకు ఇది గట్టి పోటీ ఇస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ Philips OLED760 మోడల్ లోని ప్రధాన ఫీచర్లు, ధర వివరాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఈ టీవీలోని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ గా అంబిలైట్ టెక్నాలజీని చెప్పవచ్చు. టీవీ వెనుక భాగంలో ఉండే LED లైట్లను.. స్క్రీన్ పై ప్లే అవుతున్న రంగులకు అనుగుణంగా వెనుక ఉన్న గోడపై కాంతిని ప్రసరింపజేస్తాయి. ఇది కేవలం చూడటానికి బాగుండటమే కాకుండా సినిమా చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కళ్ళపై ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.
OLED ప్యానెల్ కావడంతో ఇందులో నలుపు రంగులు చాలా ప్రభావవంతంగా కనిపిస్తాయి. దీనివల్ల కాంట్రాస్ట్ రేషియో అద్భుతంగా ఉంటుంది. రంగులు సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ఇది Dolby Vision, HDR10+ రెండింటినీ సపోర్ట్ చేయడం వల్ల.. మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో సినిమా చూసినా అత్యుత్తమ విజువల్స్ అనుభూతిని పొందవచ్చు.
గేమర్ల కోసం ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. 4K 120Hz రిఫ్రెష్ రేట్, HDMI 2.1 పోర్ట్స్ (మొత్తం 4 పోర్ట్స్) ఉండటం వల్ల గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. అలాగే, 12.8ms అతి తక్కువ ఇన్‌పుట్ లాగ్ ఉండటం వల్ల ఫాస్ట్-పేస్డ్ గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగదు. ఇది VRR, Dolby Vision Gaming కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీలో 20W అవుట్‌పుట్ ఇచ్చే 2.0 ఛానెల్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి Dolby Atmos, DTS:X సౌండ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఫలితంగా స్క్రీన్ పై వచ్చే మాటలు (Speech) చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అయితే సినిమా థియేటర్ లాంటి బేస్ (Bass) అనుభూతిని కోరుకునే వారు దీనికి విడిగా ఒక సౌండ్‌బార్‌ను జత చేసుకోవడం మంచిది.
ఇందులో TitanOS అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇది నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రధాన స్ట్రీమింగ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ‘Freely’ ఫీచర్ ద్వారా లైవ్ టీవీ ఛానెల్స్‌ను కూడా సులభంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు.
Also Read: Nosh AI Cooking Robot: ఏఐ కుకింగ్ రోబోట్.. ఒక్క బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో వంట రెడీ!
మార్కెట్‌లో ఉన్న LG B5, Samsung S85F వంటి పాపులర్ మోడల్స్‌తో పోలిస్తే ఫిలిప్స్ OLED760 దాదాపు అదే స్థాయి పనితీరును తక్కువ ధరకే అందిస్తోంది. బడ్జెట్ ధరలో ప్రీమియం OLED అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం 3 వేరియంట్లలో ఫిలిప్ OLED అందుబాటులోకి వచ్చింది. రూ.1,12,351 (55 Inches), రూ. 1,43,595 (65 Inches), రూ.1,87,336 (77 Inches) ధరల్లో అమెజాన్ లో అందుబాటులో ఉంది.
ముఖ్యగమనిక: ఫిలిప్స్ టీవీకి సంబంధించిన సమాచారాన్ని టెక్ వెబ్ సైట్స్, కంపెనీ విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా మాత్రమే అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు. కొనుగోలు చేసే ముందు ఫీచర్ల గురించి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?