Nothing Phone Discount| స్మార్ట్‌ఫోన్స్‌లో నథింగ్ కంపెనీ ఫోన్స్ డిజైన్ పరంగా స్పెషల్. ఈ బ్రాండ్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 3 చాలా పాపులర్. ఇటీవలే నథింగ్ 4 సిరీస్ ఫోన్లు లాంచ్ అయినప్పటికీ.. నథింగ్ ఫోన్ 3 ఫ్లాగ్‌షిప్‌కి ఇంకా డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం నథింగ్ కంపెనీ ఈ ఫోన్‌ని చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. 2025లో ప్రీమియం ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పటికీ టాప్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా ఉంది. అయితే అమెజాన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. లాంచ్ ధరతో పోలిస్తే చాలా ఆదా అవుతుంది.
నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) ఒరిజినల్ ధర రూ.84,999. అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.59,999కి లభిస్తోంది. అంటే రూ.25,000 తగ్గింది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ.3,000 వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. మొత్తం ఆఫర్లతో కలిపి సుమారు రూ.28,000 ఆదా అవుతుంది. ఇది ఈ ఫోన్‌పై ఇప్పటి వరకు అతిపెద్ద డీల్.
నథింగ్ ఫోన్ 3లో 6.67 ఇంచ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్‌తో వీడియోలు, ఫొటోలు మంచి క్లారిటీతో చూడొచ్చు. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి. ఫోన్ మందం 8.99mm మాత్రమే. బరువు సుమారు 218 గ్రాములు. స్లీక్ డిజైన్‌తో అందంగా, ప్రీమియంగా కనిపిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో నడుస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో బాగా పనిచేస్తుంది. హెవీ యాప్‌లు, టాస్క్‌లు లాగ్ లేకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ నథింగ్ OS 3.5తో వస్తుంది. క్లీన్, ఫాస్ట్ ఇంటర్‌ఫేస్ ఇస్తుంది.
నథింగ్ ఫోన్ 3లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరాకు OIS ఉంది. స్థిరమైన, షార్ప్ ఫోటోలు తీస్తుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా జూమ్ ఫోటోగ్రఫీకి బాగుంటుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ షాట్స్ తీస్తుంది. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. క్లియర్, హై-క్వాలిటీ ఫోటోలు ఇస్తుంది.
5500mAh పెద్ద బ్యాటరీ ఉంది. రోజంతా ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి ఈ బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్స్ ఉపయోగపడతాయి.
Also Read: తీవ్ర వేడిలో కూడా ఏసీ లాంటి చల్లదనం.. కరెంట్ లేకున్నా నడిచే పెద్ద ఎయిర్ కూలర్లు లాంచ్
నథింగ్ ఫోన్ 3లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్, మంచి కెమెరాలు, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. ఇప్పుడు డిస్కౌంట్‌తో చాలా ఆఫర్డబుల్ అయింది. హై-ఎండ్ ఫీచర్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ డీల్.
ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ ధరలు.. ఆయా కంపెనీల ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచన. ఈ కథనంలో పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. ఇక్కడ తెలిపిన వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.