E-Paper
Advertisement

Nothing Phone 4a: ట్రిపుల్ రియర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో నథింగ్ ఫోన్.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Nothing Phone 4a: ట్రిపుల్ రియర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో నథింగ్ ఫోన్.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
Advertisement

Nothing Phone 4a: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 4a మార్చి 5న గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో పింక్ కలర్ వేరియంట్, అదిరిపోయే గ్లిఫ్ లైటింగ్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ గురించి టెక్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చ మొదలైంది. కంపెనీ అధికారికంగా విడుదల చేసిన ఫోన్‌ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ చూస్తుంటే ఐఫోన్‌కు సైతం చెమటలు పట్టేలా ఉంది. మరెందుకు ఆలస్యం ఈ సరికొత్త నథింగ్ ఫోన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

మతిపోగొట్టే పింక్ కలర్ డిజైన్..

సాధారణంగా నథింగ్ ఫోన్లు వైట్ లేదా బ్లాక్ కలర్స్‌లో వస్తుంటాయి. కానీ ఈసారి యూత్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కంపెనీ సరికొత్త పింక్ కలర్ వెర్షన్‌ను పరిచయం చేస్తోంది. ఈ పింక్ షేడ్‌తో ఫోన్ చూడటానికి చాలా క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తోంది. పింక్‌తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఫోన్ వెనుక ఉండే కెమెరా సెటప్‌‌ను కూడా ఈసారి చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు. టెట్రా ప్రిజమ్ టెలిఫొటో లెన్స్‌ను వాడటం వల్ల కెమెరా బయటకు పొడుచుకు వచ్చినట్టు కాకుండా, ఫోన్ బాడీలో కలిసిపోయినట్టుగా చాలా క్రేజీగా ఉంటుంది.

Advertisement

Also Read: 5-స్టార్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. పాత ఏసీ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లిపోవచ్చు!

గ్లిఫ్ లైట్స్‌తో కొత్త అనుభూతి:

నథింగ్ ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని వెనుక ఉండే గ్లిఫ్ లైట్లు. ఫోన్ (4a)లో ఈ లైటింగ్ సిస్టమ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేశారు. కెమెరా పక్కన నిలువుగా ఉండే 6 వైట్ LED లైట్లు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మెరుస్తూ భలే లుక్ ఇస్తాయి. వీటితో పాటు ఒక స్పెషల్ రెడ్ LED కూడా ఉంటుంది. ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక ఇండికేటర్ లాగా వెలుగుతుంది. ఈ లైట్ల ద్వారా కెమెరా టైమర్ కౌంట్‌డౌన్ చూసుకోవడం, నోటిఫికేషన్లకు తగ్గట్టుగా విభిన్నమైన ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవడం వంటి ఫీచర్లు యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

లాంచ్ ఎప్పుడంటే?

Advertisement

టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 5వ తేదీన లండన్ వేదికగా ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే స్టైల్, మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

Also Read: వీడెవడండి బాబు.. ఇంట్లో కూర్చొని 7వేల రోబోట్ వాక్యూమ్ క్లీనర్లను హ్యాక్ చేసేశాడు, ఎలాగంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×