E-Paper
Advertisement

Actor Satyadev: గాయపడ్డ హీరో సత్యదేవ్.. నేడే సర్జరీ!

Actor Satyadev: గాయపడ్డ హీరో సత్యదేవ్.. నేడే సర్జరీ!
Advertisement

Actor Satyadev:సాధారణంగా సినిమా షూటింగ్లలో సెలబ్రిటీలు రియల్ స్టంట్స్ చేసేటప్పుడు అనుకోకుండా గాయపడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఆ గాయాలు ఒకటి రెండు రోజుల్లో మానిపోయేవి అయినా.. మరి కొంతమందికి ఏకంగా సర్జరీ వరకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ను మొదలుకొని ప్రభాస్ వరకూ ఇలా ఎంతోమంది హీరోలు సినిమా షూటింగ్ సమయంలో గాయపడి సర్జరీలు చేయించుకున్న వారే.. ఇప్పుడు ఆ జాబితాలోకి హీరో సత్యదేవ్ కూడా చేరిపోయారు.

షూటింగ్ సెట్లో గాయపడ్డ సత్యదేవ్..

గత వారం రోజుల క్రితం తన సినిమా షూటింగ్లో భాగంగా గాయపడ్డ సత్యదేవ్ కి నేడు చిన్నపాటి సర్జరీ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే చిన్నపాటి సర్జరీ కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు షూటింగ్ సెట్లో గాయపడి సర్జరీకి సిద్ధమవుతున్న సత్యదేవ్ త్వరగా ఆ గాయం నుండి బయటపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. సత్యదేవ్ హీరోగా తన 15వ చిత్రాన్ని SD15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2026 ఫిబ్రవరి 18న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి లక్ష్మీనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిశూల్ విజినరీ స్టూడియోస్ పతాకం పై నరేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో సత్యదేవ్ ఫరియా అబ్దుల్లాతో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష , సురేష్ గురు, ఎస్ఎస్ కాంచి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం జరుగుతున్న ఒక యాక్షన్ సీన్ షూటింగ్లో భాగంగానే ఈ చిన్న ప్రమాదం జరిగినట్లు సమాచారం.

సత్యదేవ్ సినిమా జీవితం..

2011లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో తన కెరియర్ ను ప్రారంభించిన ఈయన 2015లో జ్యోతి లక్ష్మీ, 2016లో క్షణం వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఘాజీ, బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్ , ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Advertisement

also read:Vijay – Rashmika: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా విజయ్ – రష్మిక నగలు.. వీటి తయారీకి అంతకాలం పట్టిందా?

ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

విశాఖపట్నం కి చెందిన సత్యదేవ్ ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్, నలంద టాలెంట్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసి.. MVGR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు అయ్యాడు. 2016 వరకు ఐబీఎం, VM ware లకు వర్చువల్ డిజైన్ ఆర్కిటెక్ట్ గా పనిచేసిన ఈయనా ఆ తర్వాత సినిమా కెరియర్ పై దృష్టి పెట్టడానికి ఉద్యోగాన్ని వదిలేశాడు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×