BigTV English
Advertisement

OnePlus 12R Smartphone: 8GB RAM, 50MP కెమెరా, 5500 mAh బ్యాటరీ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. డోంట్ మిస్!

OnePlus 12R Smartphone: 8GB RAM, 50MP కెమెరా, 5500 mAh బ్యాటరీ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. డోంట్ మిస్!

Huge Discount on OnePlus 12R Smartphone: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఎప్పటికప్పుడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. తరచూ ఎదో ఒక సేల్‌తో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. అందులో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్లను ప్రకటిస్తుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్ ప్రీమియం మొబైల్‌పై క్రేజీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.


OnePlus 12R భారతదేశంలో జనవరిలో ఆవిష్కరించబడింది. ఇది రూ.39,999 ప్రారంభ ధరతో రిలీజ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అలాగే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, EMI లావాదేవీల ద్వారా చేసిన కొనుగోళ్లకు అదనపు తగ్గింపులను కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా పొందవచ్చు.

Flipkartలో OnePlus 12R బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై మంచి డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.39,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 7 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ మొబైల్ రూ.36,814లకు లిస్ట్ అయింది. అయితే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.


Also Read: ఈ ఫోన్ కొన్నవారికి మనీ వాపస్.. కారణం ఇదే..?

first Flipkart UPI ట్రాన్షక్షన్‌పై రూ.50 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే Flipkart Axis Bank Cardపై 5శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా HDFC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1250.. డెబిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.1750 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే EMI ఎంపికలు నెలకు రూ.1,288 నుండి ప్రారంభమవుతాయి. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు. అందువల్ల ఎప్పట్నుచో మంచి ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్.

OnePlus 12R Specifications

OnePlus 12R Android 14-ఆధారిత OxygenOS 14పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO 4.0 AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 16GB వరకు LPDDR5x RAMతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌తో నడుస్తుంది. ఆప్టిక్స్ కోసం, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5500 mAh Battery ని కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCపై పని చేస్తుంది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×