E-Paper
Advertisement

OnePlus 13: వన్‌ప్లస్ కుమ్ముడు.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్.. ఈ సారి తగ్గేదే లే..!

OnePlus 13: వన్‌ప్లస్ కుమ్ముడు.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్.. ఈ సారి తగ్గేదే లే..!

OnePlus 13: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పలు కంపెనీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. తమ ఫోన్ వినియోగదారులకు సేఫ్టీని అందించేందుకు రకరకాల ఫీచర్లను అందించి ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగానే ఏ ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో అలాంటి ఫోన్ల పైనే వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అదీగాక ఎక్కువ ఫీచర్లనే కాదు తక్కువ ధరలో వచ్చే ఫోన్లను కూడా సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల టెక్ కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో వన్‌ప్లస్ ఒకటి.

అతి తక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ ధరలో లాంచ్ చేస్తూ మరింత పేరు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అయింది. ఇందులో భాగంగానే త్వరలో OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.  ప్రస్తుతం దీని గురించిన చర్చ ఊపందుకుంది. ఇది అతి త్వరలో లాంచ్ చేయగల కంపెనీ తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా చెప్పబడింది.

ఫోన్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్.. ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ కంటే ముందే లాంచ్ కావచ్చని చెబుతోంది. దాని ప్రకారం.. ఈ ఫోన్ Qualcomm తాజా చిప్‌సెట్ Snapdragon 8 Gen 4తో వచ్చే అవకాశం ఉందని సమాచారం. స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈసారి చైనాలో దీన్ని చాలా ముందుగానే ప్రారంభించవచ్చని కొన్ని లీక్‌లు చెబుతున్నాయి. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్ గురించి ఒక పెద్ద అప్డేట్ బయటకి వచ్చింది. చైనాకు చెందిన ప్రసిద్ధ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి OnePlus దాని రాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్ కోసం ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ముందుగానే నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

Also Read: అదరహో.. వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కు రెడీ!

ఇందులో భాగంగా Weiboలో ఒక పోస్ట్ పెట్టారు. అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో చైనాలో OnePlus 13ని ప్రారంభించవచ్చని చెప్పారు. నవంబర్ రెండవ వారంలో వచ్చే OnePlus 13 కోసం కంపెనీ ప్రత్యేక లాంచ్ విండోను నిర్వహిస్తుందని తెలిపారు. అంటే నవంబర్ 11న డబుల్ 11 టైమ్‌గా పిలిచే ఈ ఫోన్‌ను కంపెనీ సేల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని సింగిల్స్ డే అని కూడా అంటారు. ఆ రోజున చైనాలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది.

OnePlus 13 Specifications

OnePlus 12 సక్సెసర్ అయిన OnePlus 13 ఫోన్ స్పెసిఫికేషన్‌లు చాలా కాలంగా లీక్‌లు, రూమర్‌లలో ఉన్నాయి. ఇది Snapdragon 8 Gen 4 చిప్‌సెట్‌ని కలిగి ఉంటుందని చెప్పబడింది. 2K LTPO OLED స్క్రీన్‌ను ఫోన్‌లో ఇవ్వవచ్చని తెలుస్తోంది. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉంటుందని సమాచారం. వెనుక భాగంలో ఫోన్ సోనీ LYT-808 సెన్సార్‌గా ఉండే 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రావచ్చు. దీనితో పాటు, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా అందించవచ్చు. ఫోన్ 6000mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును పొందవచ్చని అంటున్నారు. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP69 రేటింగ్‌తో ప్రారంభించబడుతుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×