BigTV English

CM Chandrababu: ఓ వైపు రివ్యూ.. మరో‌వైపు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఓ వైపు రివ్యూ.. మరో‌వైపు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

CM Chandrababu: బెజవాడ‌పై ప్రకృతి కన్నెర్ర జేసింది. నగరం ఎటువైపు నుంచి చూసినా చుట్టూ వరద నీరు కనిపిస్తోంది. ఎత్తైన భవనాల్లో సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరద పరిస్థితి గమనించిన సీఎం చంద్రబాబునాయుడు రాత్రంతా మేల్కొని ఉన్నారు.


వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఏర్పా‌టు చేశారు. వివిధ ప్రాంతాల్లో వరద ప్రవాహం గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ జరుగుతున్నపనులేంటి? ఆ ప్రాంతాల్లో ఎవరెవరు చూస్తున్నారు? బాధితులకు అందించిన సాయం గురించి ఆరా తీశారు.

అధికారులు చెప్పినదంతా విన్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, సోమవారం ఉదయం మరోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు వేగవంతమ య్యాయి. కేంద్రంతో మాట్లాడిన తర్వాత పవర్ బోట్స్ విజయవాడకు చేరుకున్నాయి. ఒకవైపు ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బాధితులను బోట్లపై ఇళ్ల నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు.


ALSO READ: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..

అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బందిపడకుండా హోటళ్లలో ఉంచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయచర్యలను పరిశీలిస్తున్నారు.

పునరావాస కేంద్రాలకు వెళ్లేవారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిళ్లను బాధితులకు అందజేస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా రెడీ చేసిన ఆహారాన్ని అందజేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి.

 

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×