E-Paper
Advertisement

OnePlus 15R Offer: రూ.7వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ 15ఆర్.. డిసెంబర్ 21 నుంచి అమెజాన్ ప్రీ బుకింగ్ ఆఫర్

OnePlus 15R Offer: రూ.7వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ 15ఆర్.. డిసెంబర్ 21 నుంచి అమెజాన్ ప్రీ బుకింగ్ ఆఫర్
Advertisement

OnePlus 15R Offer: అమెజాన్‌లో ఫోన్‌పై వచ్చే ఆఫర్లు ప్రతి సారి వినియోగదారుల్ని ఆకర్షించేలా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆఫర్లు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తక్కువ మొత్తంతో ముందుగా ఫోన్‌ని బుక్ చేసుకునే అవకాశం ఇవ్వడం, తర్వాత పూర్తి చెల్లింపు చేసే వెసులుబాటు కల్పించడం అమెజాన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్లు కలిపి చూసుకుంటే ఫోన్‌ కొనాలనుకునే వారికి అమెజాన్ ఒక మంచి ఎంపికగా మారింది.

వన్‌ప్లస్ 15ఆర్ ప్రీ బుకింగ్ ఆఫర్ వివరాలు

Advertisement

ఇప్పుడు అదే కోవలో అమెజాన్‌లో వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌పై భారీ ప్రీ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ని కేవలం రూ. 999 చెల్లించి ముందుగానే ప్రీ బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 మధ్యలో పూర్తి కొనుగోలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రీ బుకింగ్ సమయంలో చెల్లించిన రూ. 999 అమౌంట్ తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ (Amazon Pay Balance)గా తిరిగి క్రెడిట్ అవుతుంది. దీంతో అదనపు ఖర్చు లేకుండా ఆఫర్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ధర, వేరియంట్లు, డిస్కౌంట్

Advertisement

వన్‌ప్లస్ 15ఆర్‌లో 12జిబి రామ్, 256జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,999గా అమెజాన్‌లో చూపిస్తున్నారు. అసలు ఎంఆర్‌పి రూ. 54,999 కాగా ప్రస్తుతం రూ. 7,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999గా ఉంది. ఈ ఫోన్ డిసెంబర్21 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ ధరల్ని చూస్తే ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఇది మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.

Also Read: Knuckles: వేళ్లు విరిచినప్పుడు ‘టక్’ అని శబ్దం ఎందుకు వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..

పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ వివరాలు

వన్‌ప్లస్ 15ఆర్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్5 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది హై పర్‌ఫార్మెన్స్ అవసరమైన గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. 7400mAh బ్యాటరీతో ఈ ఫోన్ తగినంత బ్యాకప్ ఇస్తుంది. ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చేసినా తరచూ చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

డిస్‌ప్లే, కెమెరా ప్రత్యేకతలు

ఈ ఫోన్‌లో 165Hz డిస్‌ప్లే ఇవ్వడం వల్ల స్క్రోలింగ్ స్పీడ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. వీడియోలు చూడటం, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా మారుతుంది. కెమెరా విభాగంలో 4K120fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వడం ఈ ఫోన్‌కి పెద్ద ప్లస్ పాయింట్. డిజైన్ పరంగా అప్‌డేటెడ్ లుక్‌తో మింట్ బ్రయీజ్ (Mint Breeze) కలర్ ఆకర్షణగా కనిపిస్తోంది.

ప్రీ బుకింగ్ బెనిఫిట్స్, ఈఎంఐ ఆప్షన్లు

ప్రీ బుకింగ్ బెనిఫిట్స్‌గా రూ2299 విలువైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3ని ఫ్రీగా ఇస్తున్నారు. అదనంగా 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా చెల్లిస్తే క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. మొత్తంగా అమెజాన్‌లో ఫోన్‌పై తీసుకొచ్చిన ఈ ప్రీ బుకింగ్ ఆఫర్ కొత్త ఫోన్‌ కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

మంచి అవకాశం.. డోంట్ మిస్

అమెజాన్‌లో ఫోన్లపై వస్తున్న ఈ ప్రీ బుకింగ్ ఆఫర్లు కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తక్కువ అమౌంట్‌తో ముందుగానే ఫోన్‌ను ప్రీ బుక్ చేసుకునే వెసులుబాటు, భారీ డిస్కౌంట్, ఫ్రీ గిఫ్ట్స్, నో కాస్ట్ ఈఎంఐ లాంటి బెనిఫిట్స్ కలిపి చూసుకుంటే ఈ డీల్స్ విలువ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 15ఆర్ లాంటి ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్‌పై ఇలాంటి ఆఫర్ రావడం వినియోగదారులకు లాభమే. కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉన్నవాళ్లు అమెజాన్ ప్రీ బుకింగ్ ఆఫర్లను ఒకసారి తప్పకుండా పరిశీలించడం మంచిదని చెప్పాలి.

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×