E-Paper
Advertisement

Knuckles: వేళ్లు విరిచినప్పుడు ‘టక్’ అని శబ్దం ఎందుకు వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..

Knuckles: వేళ్లు విరిచినప్పుడు ‘టక్’ అని శబ్దం ఎందుకు వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..
Advertisement

Knuckles: మనం రోజూ కాస్త అలసటగా ఉన్నప్పుడు చేతులను, నడుమును, కాళ్లను విరిచే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా విరిచేటప్పుడు టక్ అని శబ్దం వస్తే మన ఎముకల్లో ఏదో రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. ఆ క్షణంలో ఒత్తిడి తగ్గినట్టుగా, శరీరం లైట్‌గా మారినట్టుగా ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా ఆ రిలాక్స్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఆ శబ్దం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయం సింపుల్‌గా తెలుసుకుందాం.

జాయింట్ లోపల అసలు ఏం జరుగుతుంది

Advertisement

మన చేతులు, కాళ్లు, నడుము అన్నీ కదలడానికి కారణం జాయింట్లు. ఈ జాయింట్ల మధ్య సినోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది. ఈ ద్రవం ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా సాఫ్ట్‌గా కదలడానికి సహాయం చేస్తుంది. మనం చేతులు లేదా కాళ్లు విరిచేటప్పుడు ఆ జాయింట్ ఒక్కసారిగా లాగబడుతుంది. అలా లాగబడినప్పుడు లోపల ఉన్న ప్రెషర్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఆ ప్రెషర్ తగ్గిన క్షణంలో ఆ ద్రవంలో చిన్న గ్యాస్ బుడగలు ఏర్పడతాయి.

‘టక్’ శబ్దం ఎలా వస్తుంది

Advertisement

ఆ గ్యాస్ బుడగలు ఏర్పడిన వెంటనే ఒక్కసారిగా కూలిపోతాయి లేదా పేలిపోతాయి. ఆ సమయంలో వచ్చే చిన్న శబ్దమే మనం వినే ‘టక్’ లేదా ‘టాక్’ శబ్దం. ఇది ఎముకలు విరిగిన శబ్దం కాదు, ఎముకలు ఒకదానిపై ఒకటి కొట్టుకున్న శబ్దం కూడా కాదు. పూర్తిగా జాయింట్ లోపల ద్రవం ప్రవర్తన వల్ల వచ్చే సైంటిఫిక్ రియాక్షన్ మాత్రమే.

Also Read: Lenovo Yoga Slim 7i Aura: లెనోవో భారీ ఆఫర్.. పాత ల్యాప్‌టాప్ ఇస్తే రూ.25వేల వరకు తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్!

విరిచిన వెంటనే మళ్లీ శబ్దం ఎందుకు రాదు

ఒకసారి జాయింట్ విరిచిన వెంటనే మళ్లీ అదే చోట విరిచినా శబ్దం రాకపోవడం చాలామంది గమనిస్తారు. కారణం చాలా సింపుల్. ఆ గ్యాస్ బుడగలు మళ్లీ ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ౩౦ సెకన్ల నుంచి 60 సెకన్ల వరకు జాయింట్ తన సహజ స్థితికి రావాలి. అప్పుడే మళ్లీ శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది.

రిలాక్స్ అయినట్టు ఎందుకు అనిపిస్తుంది

వేళ్లు విరిచేటప్పుడు కొంతమందికి వచ్చే లైట్ రిలీఫ్ ఫీలింగ్ కూడా నిజమే. ఎందుకంటే జాయింట్ స్ట్రెచ్ అవ్వడంతో అక్కడి నర్వుల మీదున్న ఒత్తిడి తగ్గుతుంది. అందుకే టాక్ శబ్దం వచ్చిన క్షణంలో చిన్న సంతోషం, లైట్నెస్ అనిపిస్తుంది. కానీ శరీర శబ్దాలు ఎంత అప్రధానంగా అనిపించినా వాటి వెనుక సైన్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేళ్లు విరిచే టక్ శబ్దం కూడా ఆ జాబితాలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

ఇది ప్రమాదమా కాదా

సాధారణంగా ఇలా విరిచే అలవాటు వల్ల ఎముకలకు పెద్ద నష్టం జరగదు. జాయింట్లు సహజంగానే కదలికలకు అలవాటు పడినవే కాబట్టి మితంగా విరిచినప్పుడు సమస్య ఉండదు. కానీ బలవంతంగా, ఎక్కువ ఒత్తిడి పెట్టి పదే పదే విరిస్తే లిగమెంట్లు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరిగితే స్వల్ప నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు. అందుకే శబ్దం రావాలనే ఉద్దేశంతో కాకుండా లైట్‌గా స్ట్రెచ్ చేయడం మంచిది. మితంగా చేస్తే ఇది సహజమైన రిలాక్సేషన్ మాత్రమే.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×